Saturday, April 17, 2021

విశాఖ ఉక్కు ఉద్యమానికి తెలoగాణ రాష్ట్ర మద్దతు
పక్కనే ఉన్న ఇల్లు తగలబడుతుంటే మనకెందుకులే అని లైట్‌ తీసుకుంటే ఆ మంటలు మన ఇంటికి కూడా అంటుకునే అవకాశం ఉంది. ఇది తెలుసుకుని పక్కింటి మంటలు ఆర్పడంలో సాయ పడేవాడే తెలివిమంతుడు. ఇలాంటి తెలివినే ప్రదర్శించబోతోంది తెంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విషయంలోకి వెళితే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100శాతం ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ వినతుల్ని కూడా పట్టించుకోకుండా మొండిగా ముందడుగు వేస్తోంది.

దీనిపై ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నటికి నిన్న ఉక్కు ఫ్యాక్టరీ ఫైనాన్స్‌ డైరెక్టర్‌ను కార్మికులు దాదాపు 6 గంటల పాటు కారులోనే దిగ్భందించారు. ఆఖరుకు పోలీసుల సాయంతో ఆయన ఫ్యాక్టరీలోకి పరుగు పెట్టారు. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత తీవ్ర రూపం దాల్చే పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో పక్కనే ఉన్న సోదర రాష్ట్రం తెలoగాణ సైతం తన మద్దతును తెలిపింది.

ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కె. తారకరామారావు ఎమ్మెల్సీ ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘‘విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మేం కూడా మద్దతు ప్రకటిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి అనుమతితో విశాఖపట్నం కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకుంటే రేపు మన రాష్ట్రంలోని బీహెచ్‌ఈఎల్‌ ఇతర సంస్థలను కూడా కేంద్రం అమ్మేసే ప్రయత్నం చేస్తుంది.

కాబట్టి భవిష్యత్తులో మనకు కూడా ఇలాంటి అన్యాయం జరగకుండా ఉండాలి అంటే మన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రoలో జరుగుతున్న ఆ ఉద్యమానికి తప్పకుండా బాసటగా నివాలి’’ అంటూ పేర్కొన్నారు. సాటి తెలుగు రాష్ట్రం అన్యాయానికి గురౌతుంటే స్పందించిన తెలoగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ప్రజలు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు.
Related Articles

Latest Articles