ప్రేమ పై తమ్మనా పోస్ట్..ఇది బ్రేక్ అప్ కు సంకేతమా

0

సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లి అన్నవి సర్వసాధారణమైన విషయాలే అయినా, ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లే నటీనటులు తక్కువగానే ఉంటారు. ఇటీవల కొంత మంది సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అదే సమయంలో కొందరు ప్రేమలో ఉండి విడిపోయిన వారూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి ప్రేమలో మునిగిపోయిన జంటల్లో తమన్నా, విజయ్ వర్మ ఒకరిగా నిలిచారు. బాలీవుడ్‌లో త్వరలోనే పెళ్లికి సిద్ధంగా ఉన్న జంటగా వీరినే మొదటగా చెప్పుకోవచ్చు. కానీ తాజాగా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక కోట్ వల్ల, వీరిద్దరి మధ్య దూరం పెరుగుతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

తమన్నా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు అవుతున్నా, ఆమె వ్యక్తిగత జీవితంపై పెద్దగా రూమర్లు రావడం లేదు. కానీ విజయ్ వర్మతో ప్రేమలో పడిన తర్వాత, ఆమె వ్యక్తిగత జీవితం గురించి బాగా చర్చించుకోవడం ప్రారంభమైంది. విజయ్ వర్మ అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీరిద్దరూ ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్‌లో కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట, 2023 జూన్‌లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అప్పటి నుంచి వీరి రిలేషన్‌షిప్ మునుపటిలాగే కొనసాగుతోంది. కానీ తాజాగా తమన్నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన ఒక మెస్సేజ్ అందరిలో అనుమానాలు కలిగించింది.

ఆ స్టోరీలో తమన్నా, ప్రేమను ఆసక్తికరంగా ఉంచడం, నిజమైన బంధాన్ని నిలబెట్టుకోవడం వంటి విషయాల గురించి ఒక కోట్ షేర్ చేసింది. చూస్తుంటే ఈ మెసేజ్ పేరు మెన్షన్ చేయకుండా గట్టిగా ఎవరికో కౌంటర్ ఇస్తున్నట్టుగా ఉంది. దీంతో విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యిందా అనే వార్తలు మొదలయ్యాయి. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ప్రేమ బలంగా ఉందని, అలాంటి బంధం ఒక్క కోట్‌తోనే బద్దలవ్వడం సాధ్యమా? అని అభిప్రాయపడుతున్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, తమన్నా ప్రస్తుతం హీరోయిన్‌గా పెద్దగా కనిపించకపోయినా, గెస్ట్ రోల్స్, ఐటెమ్ సాంగ్స్ ద్వారా మంచి క్రేజ్‌ని కొనసాగిస్తోంది. ఆమె నటించిన ‘స్త్రీ 2’ సినిమాలో ‘ఆజ్ కీ రాత్’ పాట హిట్ కావడంతో, ఆమె ఫామ్‌లో ఉన్నట్టు మరోసారి నిరూపితమైంది. విజయ్ వర్మ కూడా ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. వెండితెరపై కొన్ని సినిమాలు మాత్రమే చేసినా, అతడి ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు మంచి గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం అతని చేతిలో అనేక ప్రాజెక్ట్స్ ఉండటంతో, కెరీర్ పరంగా బిజీగా ఉన్నాడు.

ఇలాంటి పరిస్థితుల్లో వీరి రిలేషన్‌షిప్ గురించి వస్తున్న రూమర్స్‌పై తమన్నా, విజయ్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.