గత కొద్దిగా కోలీవుడ్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న నేపథ్యంలో తనకు తెలియకుండా తన షూటింగ్ సెట్స్ నుంచి వీడియో క్లిప్స్ పెట్టారు అంటూ ధనుష్ ఆమెపై పరువు నష్టం దావా వేశారు. నయనతా, విగ్నేష్ శివన్ షూటింగ్ సెట్లో మాట్లాడుకుంటున్న ఓ చిన్ని వీడియో బిట్ ఈ డాక్యుమెంటరీలో యూజ్ చేయడం జరిగింది.‘నేను రౌడీనే’ మూవీ టైం లో తమ మధ్య ఇంటరాక్షన్ ను ఈ జంట పెళ్లి డాక్యుమెంటరీ లో చూపించారు.
దీంతో ధనుష్ నయనతార మీద కేసు వేశారు. తనకు చెప్పకుండా..తన నుంచి పర్మిషన్ తీసుకోకుండా తన సినిమా షూటింగ్ కి సంబందించిన వీడియో డాక్యుమెంటరీ లో వినియోగించుకున్నందుకు10 కోట్లు చెల్లించాలని కోర్టు ద్వారా నోటీసులు పంపించారు. ఇక దీనికి స్పందించిన నయనతార ఓ ఓపెన్ లెటర్ కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది అయితే ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిదిలో ఉంది. ఇటు నయనతార కూడా ఈ విషయం లో తగ్గేదేలేదు అంటూ న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమైంది.
మరోపక్క కోలీవుడ్ లో ఈ ఇద్దరి మధ్య వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్ ని ట్యాగ్ చేసి విమర్శిస్తున్నారు. అలాగే నయనతార ఫ్యాన్స్ కూడా ధనుష్ ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు.మరోపక్క ఇండస్ట్రీలో కూడా కొందరు నయనతారకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక తాజాగా నయనతార కూడా పరోక్షంగా ధనుష్ పైన సోషల్ మీడియాలో విమర్శలు చేసింది.
ఈ నేపథ్యంలో కర్మ ఎవరికైనా వడ్డీతో సహా తిరిగివస్తుంది అని నయనతార చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క విగ్నేష్ తన ట్విట్టర్ అకౌంట్ ని డిఆక్టివేట్ చేశారు.. అనవసరమైన న్యూసెన్స్ పెరుగుతోంది అన్న ఉద్దేశంతో ఆయన అలా చేసినట్లు టాక్ నడుస్తోంది. మరికొందరు నయనతార, ధనుష్.. ఈ ఇద్దరిలో ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతున్నారు.