అప్పుడు Why not 175 ఇప్పుడు Why not ప్రతిపక్ష హోదా

0
161
ys-jagan
Then Why not 175 is now Why not opposition status

నిజంగా వైఎస్ జగన్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారు అయిందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకి ముందు తమకు విజయం తధ్యం అని భావించిన జగన్.. 175 సీట్లు ఎందుకు రావు అని ప్రశ్నించారు. Why not 175 అంటూ ప్రచారం హోరెత్తించారు. సిద్ధం సభలకు భారీగా జనం రావడంతో వైసిపి విజయం నల్లేరు మీద నడకే అని పార్టీ భావించింది.

అయితే తీరా ఎలక్షన్ అయ్యాక చుస్తే కేవలం 11 సీట్లతో ఘోర పరాజయం పాలైంది. 2019 ఎన్నికల ప్రభంజనంలో 151 సీట్లు గెలుచుకున్న వైసిపి.. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకి నేరుగా డబ్బులు అకౌంట్ లలో వేశారు. అంతే కాక వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రతి పథకం పేదవాడి ఇంటికి వచ్చింది. నాడు నేడు పేరుతో స్కూల్స్ అభివృద్ధితో పాటు అభివృద్ధిలో కూడా ముందడుగు వేసింది.

పోర్టులు, ఫిషింగ్ హార్బర్ లు, మెడికల్ కాలేజీ ల నిర్మాణాలు, రాష్ట్రానికి పెట్టుబడులు ఇలా అనేక అంశాలలో అభివృద్ధి పరుగులు పెట్టింది. ఇంత చేసినా కేవలం 11 సీట్లు రావడంతో వైసిపి తేరుకోలేక పోతుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కక పోవడంతో జగన్ దానిపై ద్రుష్టి సారించారు. తమకు ప్రతిపక్ష హోదా కావాలని హై కోర్ట్ లో పిటీషన్ వేశారు. ఏది ఏమైనా Why not 175 నుండి Why not ప్రతిపక్ష హోదా అని అడగడం వైసీపీకి మింగుడు పడని విషయమే.