నిన్నటి వరకూ తెలంగాణ ఎన్నికలపై పడ్డ మీడియా, సోషల్ మీడియా దృష్టి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాపైకి మళ్లింది. అందులోనూ వై.యస్. ముద్దల తనయ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నట్లు వార్తలు రావడం.
ఆ వార్తలు నిజమేనని రుజువు చేసేలా ఈనెల 4వ తేదీన షర్మిళను ఢల్లీికి రమ్మని అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ఇప్పుడు తెలుగు రాజకీయాలు వేడెక్కాయి.
తెలంగాణ ఎన్నికలకు ముందే షర్మిళ తన వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే చర్చలు జోరందుకున్నప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వల్ల దాన్ని ఎలక్షన్స్ తరువాతకు పోస్ట్‌పోన్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఇక ఏపీపై ఫోకస్ పెట్టారు కాంగ్రెస్ పెద్దలు. ఈ క్రమంలోనే షర్మిళ ఢల్లీికి వెళుతున్నారు.
అక్కడే తన పార్టీని అధికారికంగా కాంగ్రెస్‌లో కలిపేసి, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా ఆమె తిరిగిరానున్నారట. దీంతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి తన అన్న పట్టుకుపోయిన కేడర్‌ను ఏ విధంగా వెనక్కు తీసుకొస్తారనే చర్చలు జరుగుతున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేడర్‌లో దాదాపు 90శాతం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కావడం వల్ల ప్రస్తుతం జగన్ వ్యవహరిస్తున్న తీరుపట్ల విసుగు చెందిన వారు కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం చాలా సులభమైన విషయం.
పైగా షర్మిళ వైయస్సార్ ముద్దుల తనయ కావడం, రాజశేఖరరెడ్డి దశాబ్దాలపాటు కాంగ్రెస్ వ్యక్తిగా ఉండటం. ఆ పార్టీ తరపున 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం, ముఖ్యమంత్రిగా ఉండగనే ప్రమాదంలో చనిపోవడం వంటి అంశాలు షర్మిళకు ప్లస్‌గా మారుతాయని ఓ వర్గం భావిస్తోంది.
మరో వర్గంవారు మాత్రం ఆమె అన్నతో ఉన్న ఆస్తి తగాదాల వల్ల మన పార్టీలోకి వస్తోంది కానీ.. అంతకు మించి మరేం లేదు. పైగా షర్మిళ చాలా అహంకారి.
అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఆమె వైఖరి సెట్ అవదు. ఆమె కూడా ఎవర్నీ లెక్కచేయని మనిషి. ఈ విషయం వైఎస్సార్‌టీపీలో పనిచేసిన ఎవరిని అడిగినా చెపుతారు. తన స్వార్ధం కోసం వైఎస్సార్‌టీపీ జెండాలు మోసిన నాయకుల్ని కార్యకర్తల్ని గాలికొదిలేసిన వ్యక్తి ఆమె.
ఆమెకన్నా ఇంకెవరినైనా చూసుకుంటే బాగుంటుందేమో అంటూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏపీ కాంగ్రెస్‌కు ఆమె ప్లస్ అవుతారో.. మైనస్ అవుతారు.