తెలుగు సినీ ఇండస్ట్రీలో పక్క రాష్ట్రాల భామలకు డిమాండ్ ఎక్కువ. అలా మన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మహానటిగా గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్. అయితే గత కొద్దికాలంగా కీర్తి తన బెస్ట్ ఫ్రెండ్ తో ప్రేమాయణం నడుపుతోంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.అయితే నిన్న మొన్నటి వరకు కీర్తి ఈ విషయంలో స్పందించలేదు.
తాజాగా ఆమె తన రిలేషన్షిప్ ని అఫీషియల్ గా ప్రకటించింది. ఆమె పెట్టిన ఇన్స్టా పోస్ట్ కి భారీ సంఖ్యలో స్పందించిన అభిమానులు.. శుభాకాంక్షలు తెలియజేశారు. 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట వచ్చే నెల వివాహం చేసుకోబోతున్నట్లు టాక్. ఏ నేపథ్యంలో అసలు కీర్తి సురేష్ ప్రేమించిన వ్యక్తి ఎవరు? ఆ ఇద్దరికి ఎప్పటినుంచి పరిచయం? అతను ఏం చేస్తున్నాడు? లాంటి వివరాలు తెలుసుకోవడానికి నెటిజెన్లు ఉత్సాహం కనబరుస్తున్నారు. అందుకే మీ అందరి కోసం వాళ్ళ ప్రేమ గురించి చిన్న పరిచయం..
కీర్తి సురేష్ ప్రేమిస్తున్న వ్యక్తి పేరు ఆంటోనీ.. వాళ్ళిద్దరూ ఈ పరిచయం ఈనాటిది కాదు స్కూల్ రోజుల నుంచి ఇద్దరు మంచి దోస్తులు. 12 స్టాండర్డ్ నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. ఈ ఇద్దరి మధ్య స్నేహ బంధానికి 15 ఏళ్లు పూర్తిగా వస్తున్నాయి. సినిమాల్లో చూపించినట్టు బెస్ట్ ఫ్రెండ్ భర్త అయితే అంతకంటే ఏం కావాలి చెప్పండి.. ఇదే ఆలోచించుకుందేమో కీర్తి కూడా ఈ రిలేషన్ కి ఓకే చెప్పేసింది.
ఈ ఇద్దరి పెళ్లి వచనల గోవాలోని ఓ చర్చిలో జరగబోతున్నట్లు ఆమె తండ్రి, మలయాళ నిర్మాత జి సురేష్ కుమార్ కన్ఫామ్ చేశారు. సౌత్ ఇండియాలోని అన్ని భాషలలో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ పెళ్లి తర్వాత కెరీర్ని కొనసాగిస్తుందా.. లేక కాస్త బ్రేక్ తీసుకుంటుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. త్వరలోనే కీర్తి , వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న బేబీ జాన్ అనే మూవీతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.