2024 అచ్చిరాని సెలబ్రిటీ జంటలు వీళ్లే..
2024 పూర్తి కావస్తోంది.. కేవలం ఒక నెల రోజులలో ఈ సంవత్సరం పూర్తయిపోయి కొత్త సంవత్సరం ఎంటర్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం ఎందరికో ఆశాజనికంగా ఉంది.. చాలా కొత్త జంటలు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాయి.అయితే మరోపక్క ఎన్నో జంటలు విడిపోయాయి.ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం చేదు అనుభవాలన్నీ చవిచూసిన 9 సెలెబ్రిటీల జంటల గురించి తెలుసుకుందాం..
ధనుష్ – ఐశ్వర్య:
సౌత్ లెజెండరీ యాక్టర్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2004లో వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 18 సంవత్సరాల పాటు కలిసి ఉన్న ఈ జంట ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నారు. అయితే ఈ న్యూస్ సౌత్ సినీ ఇండస్ట్రీ మొత్తానికి షాకింగ్ అని చెప్పాలి. ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. మరొకక్క ఐశ్వర్య కూడా కెరీర్ పరంగా ఎదగడానికి ఫోకస్ చేస్తోంది.
హార్దిక్ పాండ్యా – నటాషా స్టాంకోవిచ్ :
క్రికెట్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. మరి ముఖ్యంగా సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది క్రికెటర్లకు సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా.. ఈ ఏడాది ఐపీఎల్ టైం నుంచి వార్తలలో వైరల్ అవుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించి, డేటింగ్ చేసి అనంతరం వివాహం చేసుకున్న నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ దంపతులు ఈ ఏడాది విడిపోయారు.
ఊర్మిళ – మోసిన్ అక్తర్ మీర్:
ఒకప్పుడు కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్మిళ తన భర్త మోసిన్ ఆఫ్టర్ మీర్ కు విడాకులు ఇవ్వడం జరిగింది. 2016లో పెళ్లి చేసుకున్న ఈ జంట 8 సంవత్సరాల తరువాత ఇప్పుడు విడాకులు తీసుకున్నారు.
జయం రవి – ఆర్తి :
పొన్నియిన్ సెల్వన్ లో అరుల్మొళి వర్మన్ గా అందరినీ మెప్పించిన జయం రవి 15 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత ఈ ఏడాది తన భార్య ఆర్థిక విడాకులు ఇచ్చారు.
జీవి ప్రకాష్ కుమార్ – సైంధవి :
ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ 2013లో తన చిన్ననాటి ఫ్రెండ్ సైంధవిను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ సంవత్సరం సడన్ గా ఈ ఇద్దరు విడిపోయి అందరికి షాక్ ఇచ్చారు.
ఇషా డియోల్ – భరత్ తక్తానీ:
బాలీవుడ్ దివా హేమమాలిని, స్టార్ హీరో ధర్మేంద్ర కూతురు ఇషా డియోల్ 11 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఈ ఏడాది తన భర్త భరత్ నుంచి విడిపోయింది.
మోహిని డే – మార్క్ హార్ట్ సుచ్:
ఏఆర్ రెహమాన్ శిష్యురాలుగా గుర్తింపు తెచ్చుకున్న మోహిని డే.. తాజాగా నవంబర్లో ఆమె భర్త మార్కు నుంచి విడిపోయినట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె పేరు తెగ ట్రెండింగ్ గా ఉంది.
ఏ.ఆర్.రెహమాన్ – సైరాభాను:
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ భార్య సైరాబాను .. 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ విడాకులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి విడాకుల విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.