నిందితులకు ఉరి శిక్ష ఖరారు

0
9492

ఉరి తీయాల్సిందే.. ఆడవారిపై లైంగిక దాడి చేఇస్నా దుర్మార్గులను వెంటనే అంతం చేయాల్సిందే. అనే నినాదాలు గట్టిగా వినపడుతున్నాయి. ఏడేళ్ల నాటి నిర్భయ నిందితుల క్షమాబిక్ష పిటీషన్ రాష్ట్రపతి వద్ద ఉంది. రాష్ట్రపతి తిరస్కరిస్తే వెంటనే ఉరి తీయాల్సి ఉంది. దీనితో తలారీ కోసం తీహార్ అధికారులు వెతుకుతున్నారు. నిర్భయ కేసులో అత్యంత పాశవికంగా దాడి చేసిన నిందితులకు ఢిల్లీ హై కోర్ట్ ఉరి శిక్ష విధించింది. దీనితో వారు సుప్రీం కోర్ట్ ఆశ్రయించారు. సంబంధింత న్యాయస్థానం కూడా నిందితులకు ఉరే సరైన నిర్ణయమని ఆ తీర్పుని సమర్ధించింది. దీనితో దోషులు తమకు క్షమాబిక్ష పెట్టాలని రాష్ట్రపతి వద్ద పిటీషన్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రపతి పరిధిలో ఉంది. అయితే ఇప్పుడు దిశా ఉదంతంతో నిర్భయ నిందితులకు తక్షణమే ఉరి శిక్ష విధించాలని డిమాండ్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తీహార్ జైలులో ఉన్న నిర్భయ నిందితులుకు ఉరి వేయాలంటే తలారీ లు ఎలా అని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉరి తీసే వ్యక్తి లేకపోవడమే ఇందుకు కారణం.

మరో నెల రోజుల్లో నిందితులకు ఉరి శిక్ష విదించాలనే వార్తలు వస్తున్నాయి. కోర్టు బ్లాక్ వారెంట్ జారీ చేసిన తరువాత వెంటనే ఉరి తీయాలి. క్షమాబిక్ష పిటీషన్ ని రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే ఈ వారెంట్ ని కోర్టు జరీ చేయనుంది. చివరి సారిగా పార్లమెంట్ పై దాడి చేసిన అఫ్జల్ గురుని ఉరి తీశారు. అయితే అతడిని ఉరి తీసే సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో తీహార్ జైలు అధికారులే లివర్ ని లాగినట్లు వార్తలు వచ్చాయి. దీనితో ఇప్పుడు ఉరి లాగే వ్యక్తి కోసం అనధికారంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎవరైనా మాజీ తలారులు ఉన్నారా? అని వివరాలు సేకరిస్తున్నారు. దేశంలో ఉరిశిక్షలు వేయకపోవడంతో ఉరి తీసే వాళ్ళను నియమించలేదని.. ఇప్పుడు ఆ అవసరం వస్తుందని అలాంటి వ్యక్తి కోసం కాంట్రాక్టు ప్రాదిపడిన మాట్లాడూతున్నారు. కాగా నిర్భయ కేసులో మొత్తం ఆరుగురు ఉండగా.. అందులో ఒకరు మైనర్ బాలుడు కావడంతో విడుదల అయ్యాడు. మరొకరు జైలులోనే ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు నలుగురిని ఉరి తీయాల్సి ఉంది.