Tuesday, May 18, 2021

భార్గవ్ మాటలను ఆమె గుడ్డిగా నమ్మింది




ముందు టిక్ టాక్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తరువాత యూట్యూబ్ లో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అంతకు మించి రెచ్చిపోయాడు. అందుకే జైలు పాలు అయ్యాడు. సోషల్ మీడియాలో దుమ్ము లేపిన భార్గవ్.. దారుణాలకు పాల్పడ్డాడు. ఇంతకు ఏమి చేసాడంటే.. విశాఖ నగరంలోని సింహపురి కాలనీలో తల్లితో కలసి ఉండే 16 ఏళ్ల మైనర్ అమ్మాయికి టిక్ టాక్ లు చేయడం అంటే చాల ఇష్టం. ఆ క్రమంలోనే భార్గవ్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

టిక్ టాక్ వీడియో ల ధ్వారా పాపులర్ చేస్తానని ఆమెని నమ్మించాడు. ఇద్దరూ అన్నా చెల్లెల్లు వరుసతో పిలుచుకునేవారు. చెల్లి అనడంతో ఆమె భార్గవ్ తో మరింత స్నేహంగా ఉండేది. ఆ తరువాత ఆమెకి ఏవేవో మాయ మాటలు చెప్పాడు. మరింత దగ్గర అయ్యాడు. వరస మారింది. పిలుపు మారింది. మొత్తానికి భార్గవ్ మాటలను ఆమె గుడ్డిగా నమ్మింది.

ఇద్దరూ శారీరకంగా దగ్గర అయ్యారు. పలు మార్లు కలిశారు. ఆమె గర్భవతి అయింది. నాలుగు నెలల గర్భం వచ్చాక ఈ విషయం ఆమె తల్లి గుర్తించింది. ఈ లోపే భార్గవ్ విశాఖ నుంచి హైదరాబాద్ జంప్ అయ్యాడు. అయితే ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసాడు.





Related Articles

Latest Articles