పశు పక్షాదుల కంటే తెలివైన వాడు మనిషి. రాతి కాలం నుంచి పరిణామం చెందుతూ వస్తున్నాడు. మనిషి మాటలు నేర్వకముందు కొన్ని సైగలతో జీవనం సాగించేవాడు. ఒక్కో సైన్ కు ఒక్కో అర్థం ఉండేది.. రాను రాను మాటలు నేర్చినా.. కొన్ని సైన్ లు (చిహ్నాలను) అలాగే కొనసాగిస్తున్నాడు. అందులో ఒకటి టాయిలెట్ అడగడం..
చిటికెన వేలే ఎందుకు..
టాయిలెట్ కి వెళ్లాలంటే మనం చటుక్కున చెప్పే పద్దతి చిటికెన వేలు చూపించడం. స్కూల్లో ఉన్నప్పుడు అయితే దీని కోసం టీచర్ ను చిటికెలు చూపిస్తూ పర్మిషన్ అడితే వాళ్లం. ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ వేలే ఎందుకు అని. దాని గురించి తెలుసుకుందాం..
భారతీయ పురాణాల ప్రకారం.. చేతిలోని ఐదు వేళ్లు ప్రకృతిలోని ఐదు ప్రాథమిక మూలకాలను చూపిస్తాయట. అందులో గాలీ, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. వీటిని చూపించేందుకు మన చేతిలోని ఐదు వేళ్లను ఉపయోగిస్తాం. అందులో బొటన వ్రేలు అగ్నిని, చూపుడు వేలు గాలిని, మధ్య వేలు ఆకాశాన్ని, ఉంగరం వేలు భూమిని, చిటికెన వేలు నీటిని సూచిస్తాయి. మన శరీరంలో ఉన్న నీరు బయటకు వెళ్లేందుకు సిద్ధం కావడంతో మనకు చిటికెన వేలు నీటిని సూచిస్తుంది కాబట్టి ఆ వేలునే సిగ్నల్ గా చూపించడం మొదలు పెట్టారు. అంటే దాని అర్థం ఆ వ్యక్తి మూత్రానికి వెళ్లాలని అనుకుంటున్నాడని అర్థం. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. భారతీయ పురాణాల ప్రకారం పేర్కొన్న ఇది ఒక్క ఇండియాలో మాత్రమే ఉంటుంది. మరే దేశంలో కూడా ఇది ఉండదు.
భారతీయ పురాణాల ప్రకారం..
సిగ్నల్స్ (చిహ్నాలు) మన హిందూ బోధనలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని దేశాల్లో చిటికెన వేలు చూపిస్తే బీరు కావాలని చిహ్నం అట. ముఖ్యంగా యూఎస్ లో ఈ విధానమే నేటికీ కొనసాగుతుందట. అక్కడి పబ్ లు రెస్టారెంట్లు మ్యూజిక్ తో ఉంటాయి. ఒక వ్యక్తి మాట్లాడితే అర్థం కాదు. దీంతో వారు బీరు అడిగేందుకు చిటికెన వేలు ఉపయోగిస్తారట.
మరి రెండు వేళ్లెందుకు..
మరి మూత్రం విషయంలో చిటికెన వేలు చూపిస్తాం.. కానీ మల విసర్జనకు రెండు వేళ్లు కలిపి చూపిస్తాం కదా అనే డౌట్ చాలా మందికే వచ్చి ఉంటుంది. దీనికి నిజమైన వాదన లేకున్నా. తెలిసినంత వరకూ చెప్పుకుందాం.. మూత్ర విసర్జన దాదాపు గా నిమిషంలోపలే పూర్తవుతుంది. కానీ మల విసర్జనకు ఎక్కువ సమయం పడుతుంది అందుకని దీనికి సింబల్ గా రెండు వేళ్లు చూపిస్తారట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి మరి. దీనిపై ఇప్పటి వరకూ ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు.