టాలీవుడ్ లో రికార్డులు సృష్టిస్తున్న సీనియర్ హీరోలు

0

టాలీవుడ్‌లో కుర హీరోలు సక్సెస్ కోసం తహతహలాడుతుంటే సీనియర్ హీరోల మాత్రం తమ హవా కొనసాగిస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు. 60 ఏళ్లు దాటినా, వారి ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. ఏకంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.

ఇటీవల జరిగిన సంక్రాంతి పండుగకు సీనియర్ హీరోల సందడి ఎక్కువగానే కనిపించింది. తమ సినిమాలతో ప్రేక్షకులను మోజులో పడేశారు. ముఖ్యంగా వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రం ద్వారా వెంకటేష్ రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి సీనియర్ హీరోగా నిలిచారు. ఇది విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో మరో మెమోరబుల్ హిట్ అని చెప్పుకోవచ్చు.

ఇక మెగాస్టార్ చిరంజీవి తన రీ-ఎంట్రీ తర్వాత వరుస హిట్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. “ఖైదీ నెం. 150” సినిమాతో మొదలైన ఈ హిట్ల పరంపర “సైరా నరసింహారెడ్డి” మరియు “వాల్తేరు వీరయ్య” వరకు కొనసాగింది. ఈ సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. ముఖ్యంగా చిరంజీవి రెండు సార్లు రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఘనత సాధించారు. ఇప్పుడు “విశ్వంభర” సినిమాతో మరోసారి రికార్డులను బ్రేక్ చేయాలని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. “అఖండ” సినిమా ఆయనకు మళ్లీ బిగ్ సక్సెస్‌ను అందించింది. ఆ తర్వాత వచ్చిన “వీర సింహా రెడ్డి,” “భగవంత్ కేసరి” సినిమాలు కూడా మంచి విజయాలను నమోదు చేశాయి. ఈ సినిమాలతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ఇప్పటి వరకు వరుసగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాల సంఖ్యలో బాలకృష్ణ టాప్ ప్లేస్‌లో నిలిచారు.

ఇవాళ్టి వరకు ఈ ముగ్గురు సీనియర్ హీరోలు రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే, ఆయన కూడా త్వరలోనే మళ్లీ ఫామ్‌లోకి రానున్నారని అభిమానులు నమ్ముతున్నారు. గత కొంత కాలంగా పెద్ద హిట్ లేకపోయినా, నాగ్ మళ్లీ ఓ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అన్నట్టు, ఆయన కొత్త ప్రాజెక్ట్‌లు కూడా ఈ దిశగా ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇలా చూస్తే టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. వారి ఎనర్జీ, డెడికేషన్ చూస్తే మరికొన్నేళ్లు ఈ హవా కొనసాగడం ఖాయంగా అనిపిస్తోంది. మరి నాగార్జున కూడా త్వరలోనే మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వస్తే, టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ అందరూ తిరుగులేని స్థాయిలో కొనసాగడం ఖాయం.