ఒక మనిషి మనస్ఫూర్తిగా నవ్వడం అనేది వరంతో సమానం.. అయితే మన సో కాల్డ్ సోషల్ మీడియా పుణ్యమా అని ఓ స్టార్ హీరో నవ్వడానికే ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరొక హీరోని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేయడం కామన్ అయిపోతుంది. ఈ నేపథ్యంలో అందరి హీరోల మీద పలు రకాల మీమ్స్, ఫన్నీ పోస్ట్ మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం.
గతంలో ఒకసారి ఇదే రకంగా అల్లు అర్జున్ నవ్వు తీరుపై చాలామంది విమర్శించారు. అతను మనసారా నవ్వే విధానాన్ని కూడా ట్రోలింగ్ చేసి పెద్ద సీన్ సృష్టించారు. అప్పటినుంచి ఇప్పటివరకు పబ్లిక్ లో బన్నీ మనస్ఫూర్తిగా నవ్వడానికే ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పుడు ఎంతో మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వే వ్యక్తి ఇప్పుడు నోటికి చేయి అడ్డం పెట్టుకొని కష్టం మీద తన నవ్వు ఆపుకుంటున్నాడు.
తాజాగా జరిగిన పుష్ప ఫంక్షన్లో కూడా బన్నీ ఇదే రకంగా తన నవ్వు ఆపుకోవడం మరొకసారి సోషల్ మీడియాలో హైలెట్ అయింది. దీంతో ట్రోలింగ్ ప్రభావంతో బన్నీ మునుపటిలా ఉండడం లేదు అని అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు హాయిగా ,స్వేచ్ఛగా స్వచ్ఛంగా నవ్వే బన్నీ ఈరోజు ట్రోలింగ్ పుణ్యమా అని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
సాధారణంగా బన్నీ ఎంతో హుషారుగా ఉండే వ్యక్తి.. అనవసరమైన మెచ్యూరిటీ చూపించడం అతనికి ఇష్టం ఉండదు. ఎప్పుడు జాలీగా నవ్వుతూ ఉంటాడు.. అయితే ఇది ఒకప్పటి మాట.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ పుణ్యమా అని ఇప్పుడు బన్నీ కాస్త రిజర్వ్డ్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. నవ్వుని దాచుకుంటున్నాడు.. ఈ నేపథ్యంలో అతని అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు.
ఇక ఇప్పుడు బన్నీ పుష్ప 2 చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు లెవెల్ వసూళ్లు సాధిస్తుంది ఈ చిత్రం అని ట్రేడ్ పండితుల అంచనా. భారీ అంచనాల మధ్య మరింత భారీగా విడుదలవుతున్న ఈ చిత్రం ఎటువంటి కొత్త రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.