టాలీవుడ్ మూవీ లవర్స్ కి ఒకప్పుడు ఫేవరెట్ యాక్టర్ గా ఉన్న సిద్ధార్థ ఆ తర్వాత కెరీర్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అయితే గత కొద్దికాలంగా యాక్టర్ గా తన క్రేజ్ కాపాడుకునే విధంగా పక్క ప్లానింగ్ తో సినిమాలు తీస్తూ ముందుకు వెళ్తున్నాడు. తాజాగా సిద్ధార్థ,ఆషికా రంగనాథ్ కాంబోలో తెరకెక్కిన లవ్ సస్పెన్స్ ఎంటర్టైనర్.. మిస్ యు చిత్రం ఈనెల 29న విడుదల కాబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈరోజు ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి సందడి లేదు.. ఈ నేపథ్యంలో చిత్రం ఎందుకు విడుదల కాలేదు అన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.
ఇక ఈ మూవీపై ప్రమోషన్స్ కూడా భారీగానే నిర్వహించారు. రిలీజ్ డేట్ దగ్గర పడే సమయానికి సడన్గా సినిమాని వాయిదా వేయడం.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఒకసారి’ పుష్ప 2 వంటి భారీ పాన్ ఇండియన్ చిత్రం ముందు మీ మూవీని రిలీజ్ చేయడం రిస్క్ కాదా?’అన్న ప్రశ్నకు సిద్ధార్థ చాలా కాన్ఫిడెంట్గా ‘కంటెంట్ కరెక్ట్ గా ఉంటే, ఆ చిత్రాన్ని సినిమా హాల్ నుంచి ఎవరు తీయలేరు’ అని రిప్లై ఇచ్చారు.
అంతేకాదు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉండే చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారు.. అని సిద్ధార్థ తన సినిమాని వెనక్కి తీసుకునేది లేదు అని చెప్పకనే చెప్పాడు.కానీ సీన్ కట్ చేస్తే ఈరోజు సినిమా మాత్రం విడుదల కాలేదు. పుష్ప 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాకముందు ఈ టైం మిస్ యు సినిమా రిలీజ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అని చిత్ర బృందం భావించారు. అయితే పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కాబోతున్నట్టు డేట్ లాక్ అయ్యాక కూడా తగ్గేదే లేదు అని ప్రచారాలతో ముందుకు వెళ్లారు.
సడన్గా ఇప్పుడు చిత్రం ఎందుకు వాయిదా పడింది అన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఏదైనా డిస్ట్రిబ్యూషన్ ఇషు వల్ల ఆగిందా? లేక కంటెంట్ ని మరికొంత మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో పోస్ట్ ఫోన్ చేశారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇంతకుముందు సిద్ధార్థ ఎంతో కాన్ఫిడెంట్గా చేసిన కొన్ని కామెంట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆలస్యం వెనుక ఉన్న అసలు స్టోరీ ఏమిటి? మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయంపై క్లారిటీ త్వరలో వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.