సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ఏం జరిగినా వెంటనే ఆ వార్త వైరల్ అవ్వడం కామన్. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అయితే ఇక వాళ్ల లైఫ్ లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో విజయ్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రీసెంట్గా విజయ్ తమిళనాడులో టీవీకే అనే పార్టీని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే.
రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్న విజయ్ సినిమాలు కూడా చేయడం మానేస్తాను అని ప్రకటించారు. కానీ ఆయన హీరోగా ఉన్నప్పుడు వస్తున్న చిన్న చిన్న రూమర్స్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాక హెడ్ లైన్స్ గా మారిపోతున్నాయి. సడన్గా తమిళనాడు సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సంగీత అనే ఓ హష్ స్టాక్ వైరల్ అవుతుంది. సంగీత కి ఏమైంది అని కంగారు పడకండి.. ఇదంతా విజయ్ త్రిష తో కలిసి తిరుగుతూ సంగీతకు అన్యాయం చేస్తున్నాడు అంటూ జరుగుతున్న ఓ చిన్న ప్రచారం.
విజయ్ త్రిషతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన విషయం అందరికీ తెలుసు. ఇక ఈ ఇద్దరి మధ్య అప్పట్లో ఏదో ఉంది అన్న గాసిప్ కొన్ని రోజులు నడిచింది. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి గోవాలో జరిగింది. ఈ పెళ్లికి ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు.. అలా విజయ్, త్రిష కూడా వెళ్లారు. అయితే విజయ్ తనతో పాటు మరో ఐదుగురు తమిళ్ సినీ ప్రముఖులతో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్లో గోవాకి చేరుకున్నారు.
ఈ ఐదుగురిలో త్రిష ఉండడంతో.. తన భార్యను కాదు అని త్రిషను పెళ్లికి తీసుకువెళ్లారంటూ అపోజిషన్ పార్టీ కార్యకర్తలు రచ్చ ప్రారంభించారు. గత ఎడాది విజయ్ కు అతని భార్యతో విభేదాలు వచ్చాయి.. ఈ నేపథ్యంలో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం జరిగింది. ఇందులో నిజం ఎంత ఉంది అన్న విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ.. త్రిష కోసం సంగీతకు అన్యాయం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలైంది.
రాజకీయాల్లోకి వచ్చాక ఇటువంటివి చాలా కామన్.. ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. ఇంకా ఎలక్షన్స్ రాకముందే ఇలా ఉంది అంటే.. ముందు ముందు మరిన్ని వార్తలు బయటకు వస్తాయో చూడాలి.