రిమాండ్ లో బయటపడ్డ సంచలన నిజాలు

0
21843

మహిళ కనిపిస్తే పాడు చేయడం.. ఆపై కళ్ళు తెరిస్తే కాల్చేయడం.. ఇదే పైశాచికం నిందితుల్లో పెరిగిపోతుంది. డాక్టర్ ప్రియాంక దారుణ ఘటన వెనుక నిందితులు ప్రవర్తించిన తీరు చూస్తే ఇలానే ఉంది. కోర్ట్ కి పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్ ని పరిశీలిస్తే ఒళ్ళు జలదరించే విషయాలు బయట పడ్డాయి. నిందితులు ఎంతటి క్రూరంగా ప్రవర్తించారో కళ్ళకు కట్టినట్లు వెల్లడించారు పోలీసులు. ప్రియాంకను పాడు చేస్తున్న సమయంలో ప్రియాంక అపస్మారక స్థితికి చేరుకుంది. దానితో పారిపోవాలని భావించారు నిందితులు. అయితే అంత చీకట్లో తమను ఎవరైనా గమనిస్తున్నారా? అని కంగారు పడ్డారు. ఇంతలో ప్రియాంక కళ్ళు తెరిచి చూడడంతో నిందితులు ఆందోళన పడ్డారు. తమ పైశాచికం ఎక్కడ బయట పడుతుందేమో అనే భయంతో ఆమె నోరు ముక్కు మూసేసారు. దానితో ఆమె ప్రాణం కోల్పోయినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు. ప్రియాంక స్కూటీ కి పంచర్ చేసి.. అంతా కలసి డ్రామాలు ఆడారు. ఆపై ప్రియాంక ద్రుష్టి మరల్చిన ఆరిఫ్ బాషా.. ఆమె చేతులు గట్టిగా పట్టుకోగా, చెన్నకేశవులు ఆమె కాళ్ళు పట్టుకున్నాడు. నవీన్ నడుము పట్టుకొని పక్కనే ఉన్న గోడ అవతలికి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు. ముందుగా చెన్నకేశవులు, ఆ తరువాత మిగిలిన వాళ్ళు ఆమెను బలవంతం చేశారు.