ఈతరం వ్యక్తులకు ఉపేంద్ర పెద్దగా తెలియకపోవచ్చు కానీ 90 దసికం వాళ్ళకి ఉపేంద్ర తీసే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో బాగా అప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఉపేంద్ర ఆ తర్వాత చాలా కాలం సైలెంట్ కొన్ని చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి మెప్పించారు.
ఇప్పుడు సుమారు 10 ఏళ్ల తర్వాత ఉపేంద్ర మళ్లీ దర్శకుడిగా తెరపైకి వచ్చిన చిత్రం “యూఐ”. ఈ సినిమా ఉపేంద్ర దర్శకత్వ శైలిని కొత్త తరం ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, సమాజంలో ఉన్న స్వార్థాన్ని, మతం, జాతి, ధర్మాల ఆధారంగా మనుషుల మధ్య విభజనలను నిరూపించడానికి ప్రయత్నిస్తుంది.
ఉపేంద్ర ఓ మూవీ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘నామం’ మూవీ రిలీజ్ అవుతుంది.కథలో డైరెక్టర్ పాత్ర పోషించిన ఉపేంద్ర తన రూపొందించిన “యూఐ” అనే చిత్రాన్ని కేవలం మూర్ఖులు మాత్రమే చూడగలరని చెబుతాడు. ఆ చిత్రం ఆడియెన్స్ విభిన్నమైన అర్థం చేసుకునే క్రమంలో రివ్యూలు, వివాదాలను సృష్టిస్తుంది. సినిమాలో కీలకమైన పాత్రలు సత్య, కల్కి (రెండూ ఉపేంద్ర) సమాజానికి ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు అన్నదే కథ.
సినిమా డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన తొలి రోజుల్లో ఉపేంద్ర రాసుకున్న స్క్రిప్ట్ ఈ యూఐ అనే కోణంలో కథ సాగుతుంది.సినిమాలో మొదటినుంచే ఉపేంద్ర డైలాగ్‌లు, కధనం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. “తెలివైనోళ్లు మూర్ఖుల్లా, మూర్ఖులు తెలివైనవారిలా కనిపిస్తారు” వంటి లైన్స్ సినిమాపై ఆసక్తి కలిగిస్తాయి. కానీ ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా నడవడం, కథనంలో లోపాలు రెండవ భాగంలో కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ అజనీష్ కృషి అందంగా ఉంది. అయితే, కథనంలో లోతైన ఎమోషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా సినిమా కొంత అనుకున్న స్థాయికి చేరుకోలేదు. ఉపేంద్ర నటన మాత్రమే సినిమాను ముందుకు నడిపిస్తుంది. చరిత్రాత్మక కథా నేపథ్యం, సమాజంపై సందేశం ఉన్నా, కథనాన్ని సజావుగా తీసుకెళ్లడంలో ఉపేంద్ర కొంత మిస్సయ్యారు.
రేటింగ్: 2.5/5