ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో డిసెంబర్ 5న విడుదల కాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం పుష్ప 2. ఈ మూవీకి ఫ్రీక్వల్ గా వచ్చిన పుష్ప 2 ఎంత భారీ సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి.
అయితే ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ విషయంలో కొన్ని అడ్డంకులు కనిపిస్తున్నాయి. నిజానికి మూవీ కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రతి ఈవెంట్లో ఇప్పటివరకు బన్నీ మాట్లాడుతూ వచ్చాడు. మూవీ డైరెక్టర్ సుకుమార్ మూవీకి రిలీజ్ కి సంబంధించిన పనులలో బిజీగా ఉండడంతో ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలో కొచ్చిలో జరిగిన ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడిన విధానం సెల్ఫ్ ప్రమోషన్ గా ఉంది అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఈవెంట్ లో భాగంగా అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సరిగ్గా లేవు అంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఇంతకీ అతను చెప్పిన ఆ పాయింట్ ఏమిటి? అసలు ఈ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? దీని ప్రభావం మూడు రోజుల్లో విడుదల కాబోయే చిత్రంపై ఉంటుందా లేదా? అన్న విషయాల గురించి తెలుసుకుందాం పదండి..
గత కొద్దికాలంగా అల్లు వర్సెస్ మెగా వార్ ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా అల్లు ఆర్మీ అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నాడు. అంటే మెగా అనే టాగ్ నుంచి దూరంగా రావడానికి అల్లు ఆర్మీ ని అతను ఎంకరేజ్ చేస్తున్నాడు అని అందరూ భావిస్తున్నారు. రీసెంట్గా పుష్ప ది రూల్.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కేరళలోని కొచ్చి కి వెళ్లిన అల్లు అర్జున్ ఆర్మీ గురించి మళ్ళీ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన అభిమానులకు ఆర్మీ అనే పేరుని కొచ్చి వాసులే సృష్టించారు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీల అభిమానులకు ఆర్మీ అనే పదాన్ని వాడడం కరెక్ట్ కాదు అంటూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. మనం దేశానికి సేవ చేసే జవానులకు గౌరవప్రదంగా ఉపయోగించే ఆర్మీ అనే పేరుని అభిమాన సంఘానికి పెట్టుకోవడం పై ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
ఆర్మీ అనే పదం ఒక జాతీయ సమగ్రతకు, దేశ భద్రతకు సంకేతంగా ఉండే అంశం అని.. అలాంటి వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా పలు వేదికలపై అల్లు అర్జున్ ఆర్మీ పదాన్ని తన అభిమానులకు ఎంకరేజ్ చేయడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆయన పోలీసులను ఆశ్రయించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మూడు రోజుల్లో రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఈ కేసు చిత్రం రిలీజ్ పై ప్రభావం చూపుతుందేమో అని అభిమానులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.