మొత్తానికి అనుకున్నంత అయ్యింది. నిన్న మనం చెప్పుకున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాసయాదవ్ ఈరోజు పవన్ కల్యాణ్ సమక్షంలో కాకినాడలో జనసేన కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ గారితో యువరాజ్యంలో కలిసి పనిచేసినందువల్ల ఇప్పుడు పార్టీ మారాను అన్న ఫీలింగ్ నాకేమీ లేదు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…
నిన్న భర్త.. నేడు భార్య జగన్‌తో అడుకున్నారు..
నేను వైఎస్సార్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచీ జగన్‌గారితో ఉన్నాను. ఈరోజు పవన్ కల్యాణ్‌గారి సమక్షంలో జనసేనలో చేరటానికి వచ్చాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉంది.
నేను నా స్వంత కుటుంబంలోకి వచ్చినట్లయింది. ఈరోజు ప్రజారాజ్యంలో జాయిన్ అయిన తర్వాత పవన్ గారితో పాటు యువరాజ్యంలో పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ రావడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది.
పార్టీ మారాను అన్న ఫీలింగ్ కూడా ఏమీ లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా ఇప్పటికీ పవన్ గారి అభిమానినే. ఆయన ప్రతి సినిమా తొలిరోజే చూస్తాను. ఇప్పటికీ అది కొనసాగుతోంది. ఆ అభిమానం జీవితకాలం ఉంటుంది. పవన్ గారితో కలిసి నడవబోతున్నాను.
ఈరోజే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నాను. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కోసం నా శక్తికి మించి పనిచేస్తాను. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ పటిష్ఠతకు నా వంతు పాత్రను పోషిస్తాను. పవన్ గారికి తోడుగా ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారంలో నా వంతు సహకారాన్ని అందిస్తాను.
ముఖ్యంగా విశాఖలో నేను వైఎస్సార్ సీపీలో ఎంత కష్టపడి పనిచేశానో అందరికీ తెలుసు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాణ్ణి. అలాంటిది నాకు జరిగిన అవమానాలు అందరికీ తెలుసు.
కొన్ని శక్తుల వైఖరి, కొన్ని కారణాల వల్ల పార్టీని వీడుతున్నాను. నాకు అండగా నిలబడుతూ నాతోపాటు జనసేనలోకి వస్తున్న నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఈరోజు నుంచి జనసేన అభివృద్ధికి పవన్ గారితో కలిసి నడుస్తానని తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మరింతమంది ఈ పార్టీలోకి రావటానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయి అన్నారు.