
రాంగోపాల్ వర్మ సమర్పణలో రూపొందిన చిత్రం ‘శారీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్జీవి ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. గిరికృష్ణ కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఆరాధ్య దేవీ కథానాయికగా పరిచయం అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ప్రమోషన్ చేస్తున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ ఆరాధ్య కూడా పలు మీడియా ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా వర్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హీరోయిన్ని ఎలా ఎంపిక చేశారనే విషయాన్ని కూడా వెల్లడిస్తూ, ఆమెను ఎక్కడ చూసి, ఎలా వెతికి పట్టుకున్నారన్న వివరాలను వివరించారు.
ఆరాధ్య దేవీ వీడియోలు, ఫోటోలు, రీల్స్ చూసిన వెంటనే వర్మ ఆమెలో ప్రత్యేకమైన టాలెంట్ ఉందని గుర్తించారని చెప్పారు. ఆమెను సినిమాలో తీసేందుకు ప్రత్యేకంగా నలుగురిని నియమించి వెతికించినట్టు వెల్లడించారు. చివరకు ఆమె కేరళకు చెందిన యువతి అని గుర్తించి, తాను స్వయంగా వెళ్లి కలిశానని చెప్పారు. ఫైనల్‌గా ఆమెను శారీ చిత్రంలో అవకాశం ఇచ్చామంటూ తెలిపారు.
ఇంతవరకు శ్రీదేవి అంటే పిచ్చి అని చెప్పిన వర్మ ఇప్పుడు తన మాట మార్చడంపై కొందరు అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు, హీరోయిన్లను ఎలా ఎంపిక చేస్తారనే వర్మ స్టైల్ వినిపించడంతో కొందరు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సినిమా కథ విషయానికి వస్తే, ఒక యువతి జీవితంలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా రూపొందించిన కథ ఇది. ఓ యువకుడు తన ప్రేమను సచ్చిలంగా నమ్మి ఓ అమ్మాయిని వెంటాడుతుంటాడు. అది ఎలా ఆమె జీవితాన్ని ప్రభావితం చేస్తుందనేది కథాంశం. సైబర్ వేధింపుల వల్ల ఒక అమ్మాయి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నదనేదే ప్రధాన కథ. ఈ చిత్రాన్ని సైకాలజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.
ట్రైలర్‌తో ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. థియేటర్లలో సినిమా ఎలా రియాక్షన్ తెచ్చుకుంటుందో చూడాలి. రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఉండే ప్రత్యేకమైన క్రేజ్ కారణంగా యువత ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.