పుష్ప-2: ది రూల్ .. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న మూవీ. ఇందులో అల్లు అర్జున్ నటనకు సౌత్ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు. సినిమా విడుదలైన ప్రతి ఏరియాలో బంపర్ లెవెల్ లో కలెక్షన్స్ రికార్డ్ చేస్తూ.. ఘన విజయాన్ని నమోదు చేసుకుంటుంది. ఈ చిత్రం. మామూలుగానే సుకుమార్ చిత్రాలు అంటే మాస్ ఎలివేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఈ చిత్రం మాత్రం మాస్ జాతర అనే చెప్పవచ్చు.
ఇక ఈ మూవీలో జాతర సీన్, ఇంట్రవెల్ సీక్వెన్స్, ఎండింగ్ క్లైమాక్స్ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్స్ ఫోర్ దగ్గర నుంచి పాటల వరకు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి అంటూ తెగ పొగిడేస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ తన నటనతో మరో స్థాయికి తీసుకువెళ్లాడు అని వెంకటేష్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ అద్భుతమైన నటన చూస్తున్న నా చూపు స్క్రీన్ పైనుంచి మరచలేకపోయాను.. ఈ మూవీలో సుకుమార్ విజన్, దేవిశ్రీ సంగీతం, రష్మిక నటనతో పాటు చిత్ర బృందం అందరి కృషి అద్భుతంగా ఉంది అంటూ వెంకటేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ లాంటి వ్యక్తి చిత్రం గురించి ప్రశంసించడం ప్రస్తుతం టాప్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
విడుదలైన తొలి వారంలోని 1000 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ చిత్రం తొలి వారం హిందీలో 350 కోట్లకు పైగా వసూలు చేసింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి అప్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక నార్త్ లో అల్లు అర్జున్ నటన పై ప్రత్యేకమైన ప్రశంసలు కురిపిస్తున్నారు అక్కడ ఆడియన్స్. ఇక ఇప్పుడు వెంకటేష్ పెట్టిన ట్వీట్ తర్వాత అల్లు అర్జున్ అభిమానులు పుష్పా సృష్టించిన రికార్డులను సోషల్ మీడియా వేదికగా మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇటు తమిళ్, మలయాళం లో కూడా పుష్ప మూవీ అందరిని అలరిస్తుంది.