ప్రియాంక రెడ్డి ఘటన పై ఎందుకు గొంతు ఎత్తడం లేదు?

0
6978

ప్రియాంక రెడ్డి ఘటన పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. టాలీవుడ్ లో మహేష్ బాబు, చిరంజీవి లు ఈ ఘటనపై తమ ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా హీరో వెంకటేష్ కూడా తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ మేరకు వెంకటేష్ కూడా ఒక వీడియో విడుదల చేశారు. అందులో.. ‘ఇది ఒక్క ఆడవాళ్ళ సమస్య కాదు. దీని గురించి మాట్లాడడానికి మగవాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు. ఎందుకు గొంతు ఎత్తడం లేదు? ఆడపిల్లలు వస్తువులు కాదు.. మీ సొంతం అనుకోవడానికి. గౌరవం, స్వచ్ఛ వాళ్ళ హక్కు. అబ్బాయిలకు చెప్పండి. సత్ప్రవర్తన నేర్చుకోమని. బాధ్యతగా నడుచుకోమని. అంతా జరిగిపోయాక రియాక్షన్ కాదు. యాక్షన్ కావాలి’ అని వెంకటేష్ అన్నారు.