ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా ఉన్న విషయం పుష్ప 2 ది రూల్ మూవీ. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఈ మూవీ ని ఎప్పుడు చూడాలా అన్న ఆతృత కనబరుస్తున్నారు. ఇక డిసెంబర్ 4 రాత్రి నుంచి తెలుగు రాష్ట్రాలలో ప్రీమియం షోలు కూడా పడబోతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నార్త్ లో కూడా మంచిపట్టు కనబరుస్తోంది.
సౌత్ హీరోల సినిమాలకు నార్త్ లో ఇంత పాపులారిటీ రావడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ప్రస్తుతం నార్త్ సౌత్ తేడా లేకుండా ఎక్కడ చూసినా పుష్ప గురించే చర్చలు జరుగుతున్నాయి. పుష్ప మానియా అంతకంత పెరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన నెక్స్ట్ సీక్వెల్ పుష్ప 3 పై ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది. స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే పుష్ప 1 చిత్రం ఎటువంటి భారీ విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఆ మూవీకి సీక్వెల్ గా ఇంకొక చిత్రం వస్తుందని అందరూ భావించారు. కానీ కంటెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడం.. మూవీ సాలిడ్ హెడ్ కొట్టడంతో పుష్ప ఫ్రాంచైజ్ ని ముందుకు కొనసాగించాలని మేకర్స్ భావించినట్లు ఉన్నారు.
ఇక ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప 2 మూవీ కి సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన ఆస్కార్ అవార్డు విజేత రసూల్ పూకట్టి.. తన టీం తో కలిసిన ఓ ఫోటోని ఎక్స్ వేదికగా షేర్ చేసుకున్నారు. అయితే ఇందులో వాళ్ళ వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ లో స్క్రీన్ పై ”పుష్ప 3: ది ర్యాంపేజ్’’అనే టైటిల్ ఉంది. మరి ఆ విషయం గమనించారా ఏమో తెలియదు కానీ ఆ పోస్ట్ ని కాసేపటికి డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ ఫోటోని స్క్రీన్ షాట్స్ తీసుకున్న నెటిజన్స్.. సోషల్ మీడియాలో దీన్ని ఫుల్లు వైరల్ చేశారు.
ఈ నేపథ్యంలో పుష్ప పార్ట్ 2 ఎండింగ్లో రాబోయే పార్ట్ 3 పై ట్రూ ఇస్తారు అన్న విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మూడు సంవత్సరాల క్రితం ఈ విషయంపై దేవరకొండ అప్పుడే ఇంటిచ్చాడు. సుకుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ..”2021 – ది రైజ్, 2022 – ది రూల్, 2023 – ది ర్యాంపేజ్” అంటూ ట్వీట్ పెట్టారు. అయితే అప్పటికి ఎవరికీ కూడా పుష్ప 3పై పెద్ద స్పష్టత లేకపోవడంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తిరిగి ఈ పోస్ట్ #Pushpa3TheRampage అనే హ్యాష్ ట్యాగ్ తో వైరల్ అవుతుంది.