
విశ్వక్ సేన్ హీరోగా, ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా రామ్ నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైలా’. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారిగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇందులో అతను ఓ లేడీ గెటప్ లో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ లుక్ పై విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా మంది స్టార్ హీరోయిన్లు సైతం చూసి ఆశ్చర్యపోయేలా విశ్వక్ సేన్ అమాయకపు అమ్మాయిలా కనిపిస్తూ అందంగా మెరిశారు. ఆయన గెటప్ చూసినవారంతా సూపర్ అనే ప్రశంసలతో ముంచెత్తారు. ఈ లుక్ కారణంగా సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.
ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా 2025 ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అయితే అందరి ఊహలకు భిన్నంగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే సినిమాకు 135 నిమిషాల రన్ టైమ్ ఫిక్స్ చేశారు. సాధారణంగా A సర్టిఫికెట్ అంటే ఎక్కువగా యాక్షన్, క్రైమ్, వయలెన్స్, అడల్ట్ కంటెంట్ వంటివి ఎక్కువగా ఉంటేనే జారీ చేస్తారు. కానీ ‘లైలా’ సినిమాలో యాక్షన్, క్రైమ్ వంటి అంశాలు ఉండే అవకాశం కనిపించడంలేదు. దీంతో ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ యాంగిల్ లోనే సాగుతుందని స్పష్టంగా అర్థమవుతోంది.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇవ్వడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా A సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు అందులో ఏ విధమైన కంటెంట్ ఉందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా 18 ఏళ్లలోపు పిల్లలు చూడొద్దని సెన్సార్ బోర్డు ప్రకటించడంతో అందరి మదిలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో ఉన్న సినిమా కావడంతో ఈ సర్టిఫికెట్ రావడం ఒక్కటే కాదు, ఈ సినిమాలో ఏ రేంజ్ లో బోల్డ్ కంటెంట్ ఉందో అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాను మరింత ప్రాచుర్యంలోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ సరికొత్త ప్లాన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 9న ‘లైలా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి వంటి దిగ్గజం ఓ ఈవెంట్ కి వస్తే ఆ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఖాయం. దీనివల్ల మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసే అవకాశం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు.
సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. విశ్వక్ సేన్ కొత్త అవతారంతో అలరించనుండటంతో పాటు సినిమాకు వచ్చిన A సర్టిఫికెట్ వల్ల మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఫిబ్రవరి 14న తెలుస్తుంది.