అబ్బ.. ఏమి కట్టావు చంద్రబాబు హైకోర్టుని..!

0
635

లేటెస్ట్ టెక్నాలజి, హైటెక్ టెక్నాలజి.. ఇంకా కొత్త కొత్త టెక్నాలజి ల పేర్లు చెప్పడంతో పాటు.. సింగపూర్, చైనా, జపాన్ లలో వాడిన టెక్నాలజి ని దేశానికి తానే మొదటిగా పరిచయం చేసినట్లు గతంలో చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ టెక్నాలజి లతో ఆంధ్రప్రదేశ్ సచివాలయం కట్టగా.. కొద్దిగా వర్షం రాగానే సచివాలయం లోకి నీరు చేరడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇది టీడీపీకి పెద్ద దెబ్బగా మారింది కూడా. వేయి కోట్ల రూపాయలతో సింగపూర్ టెక్నాలజి ని ఉపయోగించి కట్టినా.. సచివాలయం సీలింగ్ లో నుండి ఇప్పటికీ నీరు కారుతూనే ఉంది. ఇక తాజాగా.. ఇప్పుడు చంద్రబాబు కట్టించిన మరో బిల్డింగ్ కి ఆ ముప్పు వచ్చి పడింది. అది కూడా సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.

అవును అమరావతిలో కురుస్తున్న వర్షాలకు హైకోర్టు సీలింగ్ లో నుండి భారీగా నీరు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. లోపలి వచ్చిన నీటిని ఎప్పటికప్పుడు తోడి సిబ్బంది బయటకి ఎత్తి పోస్తున్నారు. సచివాలయం లానే.. హైకోర్టు లో కూడా సరైన నాణ్యత పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చంద్రబాబు పై కౌంటర్ లు వేస్తున్నారు ప్రజలు. చంద్రబాబు కట్టిన ఏ బిల్డింగ్ నుండి అయినా ఇలానే నీరు కారతాయని.. అందులో ఆశ్చర్యం లేదని కొందరు అంటుండగా.. ఇండియన్ టెక్నాలజి కాకుండా, జపాన్ టెక్నాలజి వాడితే ఇలానే ఉంటుందని మరి కొందరు చంద్రబాబు పైన జోకులు వేస్తున్నారు.