Saturday, April 17, 2021

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో పెళ్లి పత్రికలు ఎలా ఉండేవో చూడండి…చివరి లైన్ చూస్తే అప్పటి పరిస్థితులు అర్ధమవుతాయి.!




పెళ్లి పత్రిక…డిజైన్స్ ఎన్ని వచ్చిన ముఖ్యంగా అన్నిట్లో కామన్ గా కనిపించేవి “శ్రీరస్తు-శుభమస్తు-ఆశీర్వమస్తు” అని మొదలవ్వడం. “బంధు మిత్ర సపరివార సమేతంగా” అందరు రావాలి అని చివర్లో ఉండడం. కానీ దీనికి భిన్నంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పెళ్లి పత్రిక ఎలా ఉండేదో తెలుసా.? అప్పటి జాతీయోధ్యమ నినాదాలతో ఉండేది. అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేవి పెళ్లి ఆహ్వాన పత్రికలు.

శాంతి-స్వాతంత్ర్యం-అభ్యుదయం అంటూ జాతీయోధ్యమ మాటలతో…‘వందేమాతరం’ అంటూ ఆహ్వాన పత్రిక మొదటి లైన్ లో ముద్రించేవారు. చివర్లో “దయచేసి మీ రేషన్ బియ్యం ముందుగా పంపలాని కోరుచున్నాం” అనే లైన్ ఆహ్వాన పత్రికలో చూడొచ్చు. అప్పటి ఆర్ధిక పరిస్థితులకు, దేశ భక్తికి అద్దం పట్టినట్టు ఉండేవి పెళ్లి ఆహ్వాన పత్రికలు.




Related Articles

Latest Articles