Saturday, April 17, 2021

ఆమె 12 రోజులు అరటిపండు మాత్రమే తినింది అంట…తర్వాత ఏమైందో తెలుసా.?




అరటిపండ్లు బలవర్ధకమైన ఆహరం అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఓ పూట అన్నం తినడం లేదా ఏదైనా ఆహరం తీసుకోవడం కుదరకపోతే, రెండు అరటిపండ్లు తీసుకుంటే కడుపునిండిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అయితే, కొందరు ఇది డైట్ ఫుడ్ లో కూడా తీసుకుంటూ ఉంటారు. ఉదయాన్నే ఏమి తినకుండా అరటిపండు మాత్రమే తింటే, అరటిపండు మంచి వెయిట్ కట్టర్ గా కూడా పనిచేస్తుంది.

bananas

యూలియా అనే ఓ మహిళా దాదాపు పన్నెండు రోజుల పాటు కేవలం అరటిపండ్లను మాత్రమే ఆహరం గా తీసుకుందట. ఇతర ఆహారం ఏమి తీసుకోకుండా కేవలం అరటిపండ్లను మాత్రం తినడం వలన ఆమె శరీరంలోని విషపదార్ధాలు అన్ని దూరం అయిపోయిన ఫీలింగ్ కలిగిందట. మనసు కూడా ఎంతో ప్రశాంతం గా మారిపోయినట్లు అనిపించిందట. ఆమె ఏ పని చేస్తున్నా చాలా ఏకాగ్రత గా పని చేస్తున్న అనుభూతిని పొందింది. అయితే ఎన్ని పనులు చేసినా ఆమె అసలు అలిసిపోలేదట. చర్మం కూడా మెరుస్తూ కాంతివంతం గా కనిపించడం మొదలైందట. మూడు పూటలా ఎన్ని కావాలంటే అన్ని అరటిపండ్లు తినేసి, ఎంత నీరు కావాలంటే అంత నీరు తాగేది. ఇలా పన్నెండు రోజుల పాటు బనానా డైట్ చేసాక తనలో ఎన్నో మార్పులు వచ్చాయని ఆమె చెబుతోంది.





Related Articles

Latest Articles