Saturday, April 17, 2021

రాఫెల్ విమానాలను న‌డిపిన పైల‌ట్లు మోకాళ్ల‌కు ధరించిన ఈ నీ బోర్డ్ లో ఏమున్నాయ్?
భార‌త ప్ర‌భుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలు ఇటీవ‌లే భార‌త్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 36 వర‌కు విమానాల‌ను కొనుగోలు చేయ‌గా.. మొద‌టి విడ‌త కింద 5 విమానాలు భార‌త్‌కు ఇటీవ‌లే చేరుకున్నాయి. పైల‌ట్లు ఆ విమానాల‌ను సుర‌క్షితంగా భార‌త్‌కు తీసుకువ‌చ్చారు. అయితే ఆ విమానాల‌ను వారు భార‌త్‌లో దింపిన అనంత‌రం ప్ర‌దర్శ‌న ఇచ్చారు. అందులో భాగంగా వారి మోకాళ్ల‌కు ప‌లు పేప‌ర్లు క‌ట్టుకుని ద‌ర్శ‌న‌మిచ్చారు. అయితే అస‌లు ఆ పేప‌ర్లు ఏమిటి ? అని చాలా మందికి సందేహాలు వ‌స్తున్నాయి. మ‌రి అవేమిటో ? వాటిని పైల‌ట్లు మోకాళ్ల‌కు ఎందుకు ధ‌రించారో ? ఇప్పుడు తెలుసుకుందామా..!

పైల‌ట్లు మోకాళ్ల‌కు ధ‌రించిన ఆ పేప‌ర్ల‌ను నీ బోర్డ్ (knee board) అంటారు. వాటిని పైల‌ట్లు రాఫెల్ లాంటి జెట్ విమానాల‌ను న‌డిపేట‌ప్పుడు ధ‌రిస్తారు. సాధార‌ణంగా ఆ విమానాల్లో పైల‌ట్లు కూర్చునే వ‌ద్ద స్పేస్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల వారు త‌మ‌కు సంబంధించిన ముఖ్య‌మైన వివ‌రాల‌తో కూడిన పేప‌ర్ల‌కు గాను వ‌ర్క్ చేసుకునేందుకు అలా మోకాళ్ల‌కు నీ బోర్డుల‌ను ధ‌రిస్తారు.
ఇక ఎడ‌మ కాలుకు ధరించే నీ బోర్డుపై ఉండే పేప‌ర్ల‌లో పైలట్ల చెక్ లిస్ట్ ఉంటుంది. అంటే.. విమానానికి సంబందించి ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దు, సాంకేతిక విష‌యాలు.. ఆ పేప‌ర్ల‌లో ఉంటాయి. అలాగే ఎడ‌మ‌కాలుకు ధ‌రించే నీ బోర్డుపై ఉండే పేప‌ర్ల‌పై వారు ప్ర‌యాణించాల్సిన విమాన మార్గానికి చెందిన వివ‌రాలు, అందుకు సంబంధించిన మ్యాపులు, టేకాఫ్‌, ల్యాండ్ అవ్వాల్సిన ప్ర‌దేశాలు, వాటి మ్యాపులు, మిష‌న్ వివ‌రాలు ఉంటాయి. ఇలా రెండు మోకాళ్ల‌కు ఉండే నీ బోర్డుల‌పై భిన్న‌మైన వివ‌రాలతో కూడిన పేప‌ర్లను ధ‌రిస్తారు. విమానాన్ని న‌డుపుతున్న‌ప్పుడు వాటిని చెక్ చేసుకుంటూ ముందుకు సాగుతారు. అలాగే ఆ పేప‌ర్ల‌లో ఏమైనా రాసేందుకు కూడా అనువుగా ఉండేందుకు ఆ నీ బోర్డ్‌ల‌ను ధ‌రిస్తారు.

అయితే కొన్ని దేశాల్లో ఆర్మీ వారు నీ బోర్డ్‌ల‌కు బ‌దులుగా ఐప్యాడ్ల‌ను ధ‌రిస్తారు. కానీ వాటిని ప‌దే ప‌దే చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. అలాగే విమానం క్రాష్ అయిన‌ప్పుడు అవి డ్యామేజ్ అయ్యేందుకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక వాటిని కేవ‌లం కొన్ని సందర్భాల్లోనే వాడుతున్నారు. మిగిలిన అన్ని స‌మ‌యాల్లో దాదాపుగా పైలట్లు పైన తెలిపిన నీ బోర్డ్‌ల‌నే వాడుతున్నారు. అదీ.. వారు మోకాళ్ల‌కు ధ‌రించిన పేప‌ర్ల వెనుక ఉన్న అస‌లు విష‌యం..!

 
Related Articles

Latest Articles