ప్రియుడి కోసం అన్నంలో విషం పెట్టి భర్తను చంపిన భార్య

0
726

ఈ మధ్య కాలంలో కట్టుకున్న భార్యలు చేస్తున్న దారుణంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో తన సహజీవనానికి అడ్డంగా ఉన్నాడని.. భర్తకు అన్నంలో విషం పెట్టి చంపింది ఓ భార్య. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన వివరాలలోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో మూడు గుడిసెల తండాకి చెందిన మాలోత్ మోహన్ అనే 30 ఏళ్ల వ్యక్తికి పావని అనే భార్య ఉంది. వీరి కాపురం సజావుగా సాగుతుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే.. కొన్నాళ్ల క్రితం ఆ గ్రామానికే చెందిన అజ్మీర శ్రీను అనే వ్యక్తితో పావనికి పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్తా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన భర్త.. ఆ ఊరి పెద్దల వద్ద పంచాయితీ పెట్టించాడు. పంచాయితీ పెట్టిన పెద్దలు పావనిని హెచ్చరించారు. దీనితో భర్త పై కోపం పెంచుకున్న పావని.. అతడిని ఎలాగైనా హతమార్చాలని అనుకుంది. ప్రియుడు శ్రీనుతో కలిసి ఓ పథకం రచించింది పావని. పథకం ప్రకారం భర్త తినే అన్నంలో విషం కలిపింది పావని. ఈ విషయాన్నీ గమనించిన మాలోత్ మోహన్ తల్లి.. ఆ ఊరి వాళ్లకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆసుపత్రికి వెళ్లే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. దీనిపై మోహన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టారు.