ప్రియుడితో కలిసి భర్తకు స్కెచ్ వేసిన భార్య..!

0
8122

తనను హత మార్చాలని అనుకున్న భార్య బండారం బయట పెట్టాడు ఓ భర్త. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. రజియాభేగం తన భర్త హాసమొయిద్దీన్ ని హత్యా చేసేందుకు స్కెచ్ వేసింది. భర్త మిత్రుడితో వివాహేతర సంబంధం పెట్టుకొన్న రజియాభేగం ప్రవర్తనపై అనుమానం వచ్చిన హాసమొయిద్దీన్ ఆమె స్కెచ్ కనిపెట్టాడు. భార్య, అతడి ప్రియుడి ఫోటోలు, ఆడియోలు తీసి పోలీసుల ముందు పెట్టాడు. దీనిపై భర్త హాసమొయిద్దీన్ మాట్లాడుతూ.. 2012 లో తమకు పెళ్లి అయిందని.. తమకు ఇద్దరు ఆడ పిల్లలని చెప్పాడు. తన స్నేహితుడు తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకొని.. వాళ్లిద్దరూ కలసి తనను చంపాలని చూసారని చెప్పాడు. ఒకసారి కరెంటు షాక్ ఇవ్వడానికి ప్రయత్నం చేసారని.. అది కుదరక పోవడంతో, అన్నంలో మందు కలిపారని చెప్పాడు. తన ఆస్థి కోసం తనను చంపాలని చూసారని చెప్పాడు. హైదరాబాద్ పోయి లాడ్జి లోకి వెళ్లి ఫోటోలు, వీడియో లు తీసుకున్నారని చెప్పాడు. అవి తనకు దొరికాయని.. అవి పోలీసులకు అందించానని చెప్పాడు.