Saturday, July 24, 2021

పుట్టింటికి వెళ్తున్న భార్య తన భర్త కు ఓ లెటర్ రాసిచ్చింది.. అది చూస్తే నవ్వాపుకోలేరు..!

జెనరల్ గా భార్య పుట్టింటికి వెళ్తే.. భర్తలు అమితానందం పొందుతారు కానీ, అది ఒక రోజు ముచ్చటే. మొదటిరోజుకు భార్యలు అన్ని ఏర్పాట్లు చేసేసి వెళ్ళిపోతారు. ఆ తరువాత రోజు మొదలవుతాయి మొగవాళ్ళ ఇక్కట్లు. వంట చేసుకోవడం రాని వారైతే వారి ఇబ్బందులు చెప్పక్కర్లేదు. ప్రస్తుతానికి స్విగ్గి, జొమాటో లు ఉన్నా.. రోజు వాటితోనే అంటే కష్టం కదా..

letter

ఓ భార్య ఇలానే పుట్టింటికి వెళ్తూ.. తగు జాగ్రత్తలు చెబుతూ భర్తకు ఓ లెటర్ రాసి పెట్టింది. అందులో ఆ భార్య ఏమి రాసిందో చూస్తే మీరు నవ్వాపుకోలేరు.

#పొద్దు పొద్దున్నే, పాలొచ్చాయా… పేపర్ వచ్చిందా అంటూ పక్కింటివాళ్ల ను లేపి వారి నిద్రను చెడగొట్టద్దు. మిమ్మల్ని వదిలి వెళ్లినందుకు వాళ్ళు నన్ను తిట్టుకుంటారు..
#మీ కళ్లజోడుని బాత్ రూమ్ లోనే మర్చిపోయి ఇల్లంతా కెలికి పాడుచేయకండి.
# పార్టీ పేరుతొ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చి.. ఇల్లు పాడుచేయకండి.. సర్దాలంటే.. మరో రెండు రోజులు పడుతుంది.
#ఇంటర్నెట్ రావడం లేదని కంగారు పడకండి.. ఫోన్ చూస్తూ పగలో..రాత్రో.. మీకు తేడా తెలియదని నేనే తీసేయించాను.
#నేను ఉరికి తిరిగి వచ్చే వరకు పనిమనిషి వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది.
#స్టవ్ వెలగడం లేదని కంగారుపడి నాకు ఫోన్ చేయద్దు. వెలిగించే ముందు కాస్త స్టవ్ ని ఆన్ చేయండి.
#చివరగా, నేను మళ్ళీ వస్తానన్న విషయాన్నీ మరిచిపోకండి.

Related Articles

Latest Articles