కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, లేడీ సూపర్ స్టార్ నయనతార మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. నిజానికి నయనతార కు సంబంధించిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం ప్రారంభమయ్యాక వీరిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. ఈ డాక్యుమెంటరీలో నయనతార నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ వీడియో క్లిప్ ని తన అనుమతి లేకుండా పెట్టారు అనేది ధనుష్ ఆరోపణ.
ఈ మూవీ షూటింగ్ సమయంలోనే బడ్జెట్ విషయంలో నయనతార, ధనుష్మధ్య అప్పట్లో గొడవలు జరిగాయి. పది సంవత్సరాల తరువాత తిరిగి ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంసంగా మారింది. నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీలో తన చిత్రానికి సంబంధించిన పాటను ఉపయోగించడానికి ధనుష్ మొదట అంగీకరించలేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం నయనతార సుమారు రెండు సంవత్సరాల పాటు తిరిగిందట.
దీంతో ఫైనల్ గా విసుగు చెందిన నయనతార ఆ పాటను వద్దు అనుకొని ఆ చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఏవో కొన్ని దృశ్యాలను డాక్యుమెంటరీలో ఉపయోగించింది. అయితే ధనుష్ తన పర్మిషన్ లేకుండా సినిమాలోని క్లిప్ వాడారు అంటూ నయనతార తో పాటు ఆమె భర్త విగ్నేష్ శివన్, అతని సొంత నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ పై 10 కోట్లకు నష్టపరిహారం కేసు వేశాడు. దీనిపై స్పందించిన నయనతార ఓ భారీ ఓపెన్ లెటర్ తో అతనికి సమాధానం కూడా ఇచ్చింది. కేసు విచారించిన న్యాయమూర్తి నాయనతారను సమాధానం ఇవ్వవలసిందిగా ఆదేశించారు.
ఇక ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తాజాగా నాయన తార పెట్టిన పోస్ట్ ధనుష్ విడాకుల గురించి.. కర్మ ఫలితాన్ని గురించి సూచిస్తోంది అంటున్నారు అభిమానులు. 2004లో రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకున్న ధనుష్ 2022లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఈ ఇద్దరికీ విడాకులు మంజూరు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో నయనతార తన ఇన్స్టా స్టోరీలో “అబద్ధం చెప్పి ఒకరి జీవితాన్ని నాశనం చేసినప్పుడు.. అది కేవలం మనం చేస్తున్న అప్పు అని గుర్తుపెట్టుకోవాలి.. కర్మ దాన్ని వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది”అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఇక ఇది ధనుష్ విడాకుల గురించి నయనతార విమర్శిస్తున్నట్లుగా అతని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ తో ఉన్న గొడవలు, అతని విడాకులు, పోర్టు కేసులు వీటన్నిటినీ ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినట్టుగా అందరూ భావిస్తున్నారు.