తెలంగాణ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం కొంతమంది రాజకీయ నాయకులకు , ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అసలు మింగుడు పడడం లేదు.
అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తాను అని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ని పదే పదే ఆ విషయాన్నీ గుర్తు చేస్తూ నెల రోజులు కాకముందే తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నారు.
ఇప్పటికే రైతు బంధు స్కీం మొదలైంది, గృహాలక్ష్మీ స్కీం క్రింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా మొదలైంది.
ఇలా చిన్నగా ఇచ్చిన గ్యారంటీలను రేవంత్ రెడ్డి అమలు చేసుకుంటూ పోతున్నాడని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లో వణుకు మొదలైందా?,
అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే తమ పార్టీ కి మనుగడ ఉండదు అని బీఆర్ఎస్ నాయకులూ భావపడుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇదంతా పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ, మూడు నెలల్లో, లేదా నాలుగు నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుంది అని బలమైన నమ్మకం తో ఉంది. రాష్ట్రం అప్పుల కుప్పలో మునిగిపోయింది.
పథకాలను అమలు చెయ్యడానికి డబ్బులు లేవు, పోనీ రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులపై ఆధారపడి ఉన్నాడు.
అంతే కాకుండా ఎన్నికల ఫలితాలు వచ్చిన వేంటనే గులాబీ బాస్ తన ఎమ్యెల్యే అభ్యర్థులతో మూడు నెలలు ప్రశాంతం గా ఉండండి, అన్నీ సర్దుకుంటాయి అని చెప్తాడు.
దీని అర్థం ఏమిటి?, అంటే కాంగ్రెస్ పార్టీ ని కూల్చేయడానికి కేసీఆర్ ఏమైనా వ్యూహాలు పన్నుతున్నాడా?, ఏ ధైర్యం తో అలా అన్నాడు అనేది అర్థం కావడం లేదు. మరో పక్క వంద రోజుల్లో ఇచ్చిన హామీలను పూర్తి చెయ్యాలని బీఆర్ఎస్ నాయకులూ పదే పదే కాంగ్రెస్ ని అడుగుతున్నారు.
వీళ్ళు అధికారం లో ఉన్నప్పుడు ఇస్తామన్న హామీలను ఏళ్ళు గడుతున్న కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు. రాష్ట్రం అప్పులో ఉందనే విషయం తెలిసి కూడా ప్రతీ సారి ఇలా వంద రోజుల్లో అద్భుతాలు జరిగిపోవాలి అనడం లో ఏమైనా అర్థం ఉందా.
చేతిలో ఖాళీ ఖజానా ఉన్న ప్రభుత్వం అప్పచెప్పి వెళ్లిపోయారు, నిధుల కోసం మోడీ ని కలిసినా, విదేశాలకు పయనం అయినా కూడా రేవంత్ రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు.
ఆయన ముఖ్యమంత్రి అవ్వడం వీళ్ళందరికీ ఎక్కడో కాలినట్టుగా అనిపిస్తుందని, దాని తాలూకు నొప్పులే ఇదంతా అని రాజకీయ విశ్లేషకులు సైతం చెవులు కొరుక్కుంటున్నారు.