Saturday, April 17, 2021

మమతపై దాడితో వేడెక్కిన బెంగాల్‌ రాజకీయం




సుధీర్ఘ కాలo వామపక్ష పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ను తన వశం చేసుకోవటానికి ఎన్నో పోరాటాలు చేశారు మమతా బెనర్జీ. రాజకీయంగా ఎన్ని ఒడి దుడుకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో అనుకున్నది సాధించారు. రెండు పర్యాయాలు పశ్చిమ బెంగాల్‌ పీఠంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ జెండాను ఎగుర వేశారు. మరి కొద్ది రోజుల్లో అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో మమతా బెనర్జీ ప్రచారంలో భాగంగా నందిగ్రామ్‌ వెళ్లారు.

అక్కడి శివాలoలో పూజలు చేసి తిరిగి వస్తుండగా ఆమెపై కొందరు దుండగు దాడి చేసినట్లు ఆరోపణలు చేశారామె. దీంతో ఒక్కసారిగా బెంగాల్‌ రాజకీయం వేడకెక్కింది. తనపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు అని అరోపించిన ఆమె వెంటనే ప్రత్యేక హెలికాప్టర్‌లో కోల్‌కతా వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో భవానీనగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె. తాజాగా నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అటు వామపక్షాలతో పాటు బీజేపీతో కూడా తీవ్రంగా తలపడుతోంది. ఇప్పటికే బీజేపీ పలువురు తృణమూల్‌ కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుంది. తాజాగా ఆ రాష్ట్ర డీజీపీని ఎలక్షన్‌ కమిషన్‌ తొలగించింది. అయితే డీజీపీ తొలగింపు వెనుక బీజేపీ అధిష్ఠానం ఉందన్నది మమత ఆరోపణ. మరోవైపు మమత తనపై దాడి చేసిన సమయంలో అక్కడ పోలీసు కూడా తగినంత లేరని ఆరోపించారు. అసలే నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రం.

అక్కడ ముఖ్యమంత్రికి అసాధారణ భద్రత ఉంటుంది. కానీ ప్రస్తుతం మమతకు ఉండాల్సిన స్థాయిలో భద్రత లేకపోవడం తృణమూల్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవర పరుస్తోంది. మమతపై దాడితో తృణమూల్‌ కేడర్‌ ప్రతీకారంతో రగిలి పోతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.




Related Articles

Latest Articles