Saturday, April 17, 2021

షర్మిలకు తొలి షాక్‌ తగిలింది




రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు దగ్గరౌతారో.. ఎప్పుడు ఎవరు దూరమౌతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఎవరి ప్రయోజనాలు వారివి. కాబట్టి వాళ్లను తప్పు పట్టేకన్నా ఉన్నవారితో ముందుకెళ్లడమే నాయకుల ముందున్న మార్గం. రాజకీయ పార్టీ ప్రకటించక ముందే వై.యస్‌.ఆర్‌. తనయ షర్మిలకు అనేక వర్గాల నుంచి ఊహించని మద్దతు భించింది. అనేకమంది నీకు మేమున్నాం అంటూ భరోసా కూడా ఇచ్చేశారు. వీరిలో యాంకరు శ్యామలారెడ్డి కూడా ఒకరు.

ఇటీవ షర్మిలను కలిసిన ఆమె షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి తనకు చాలా సంతోషంగా ఉంది అంటూ స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చేసింది. పాపం షర్మిల కూడా అది నిజమే కాబోలు అని ఫీలయ్యినట్టున్నారు. ఎలాగూ తమ సామాజిక వర్గమే కాబట్టి శ్యామలారెడ్డి తనను వీడి పోదని భరోసాగా ఉన్నారనుకుంటా. ఇంతకు ముందు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తన మద్దతు తెలిపిన ఆమె 2019 ఎన్నికల్లో కొన్ని చోట్ల ప్రచారం కూడా నిర్వహించారు.

అయితే ఆమె ఆశించిన ప్రయోజనాలు పార్టీ నుంచి దక్కక పోవడంతో తన షూటింగ్‌లు, యాంకరింగ్‌కు పరిమితం అయ్యారు. ఇటీవ షర్మిల అన్నతో సంబంధం లేకుండా స్వంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్లు తొలుసుకుని ఆమె పంచన చేరింది. అయితే శ్యామలారెడ్డి మాత్రం సడన్ గా ప్లేట్‌ ఫిరాయించారు. కొద్ది సేపటి క్రితం జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ‘‘మీ వెనుక నడిచే లక్షల అడుగులలో నేను కూడా’’ అంటూ ట్విట్టర్‌లో ప్రకటించారు.

అంతేకాదు జగన్‌మోహన్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో షర్మిల స్వీయ రాజకీయ ప్రయాణంలో తొలి షాక్‌ తగిలిందనే చెప్పుకోవాలి. ఇలాంటి రాక, పోకలు భవిష్యత్తు మరిన్ని ఉంటాయి. వాటిని తట్టుకునే స్థాయిలో షర్మిల మెంటల్‌గా సిద్ధంగా ఉండాలి.




Related Articles

Latest Articles