సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య రిలేషన్షిప్ ఉండడం చాలా కామన్. కలిసి సినిమాల్లో పనిచేసిన ఎందరో హీరో హీరోయిన్లు అనంతరం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తున్న సెలబ్రిటీ కపుల్ ఎవరు అంటే రష్మిక మందన.. విజయ్ దేవరకొండ అని చెప్పొచ్చు. ఈ ఇద్దరికి సంబంధించి రిలేషన్షిప్ రూమర్స్ ఎప్పటినుంచో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇద్దరు పెట్టే పోస్టులు కూడా వీటికి తగినట్టుగానే ఉండడంతో అందరూ వీళ్ళ మధ్య ఏదో ఉంది అనే గెస్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇద్దరిలో ఎవరు కూడా వాళ్ళ రిలేషన్షిప్ అయి ఎటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ దేవరకొండ తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి.. ఇంకా సింగిల్ గా ఉన్నాను అనుకుంటున్నారా అంటూ ఓ బాంబు పేల్చాడు. మరొక రష్మిక కూడా తాజాగా జరిగిన పుష్పట్టు ఈవెంట్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఇన్ డైరెక్ట్ సమాధానం చెప్పకనే చెప్పింది.
‘అందరికీ తెలిసిన విషయమే కదా.. మీకు కూడా తెలుసు.. అయినా కావాలని అడుగుతున్నారు..’ అంటూ యాంకర్ కు ఇన్ డైరెక్ట్ గా కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. దీంతో ఇటు విజయ్, అటు రష్మిక ఇద్దరూ తమ రిలేషన్షిప్ నీకు కన్ఫామ్ చేశారు అంటూ నటిజన్లో అంటున్నారు. తాజాగా జరిగిన పుష్ప 2 ఈవెంట్లో శ్రీవల్లి పాత్ర పోషించే రష్మికను ‘మీరు ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉన్నారా? అవతలి నుంచి ప్రపోజల్ వస్తుందా?.. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తా? బయటి వ్యక్తా?’అంటూ ఆమె రిలేషన్షిప్ గురించి ప్రశ్నలు అడిగి యాంకర్లు తెగ ఇబ్బంది పెట్టారు.
ఇక దీనికి రష్మిక తెలివిగా ఆలోచించి వ్యక్తి పేరు చెప్పకుండా మీకు తెలిసిందే కదా అంటూ తప్పించుకుంది. దీంతో రష్మిక విజయ్ దేవరకొండ గురించి చెప్పింది అని చాలామంది వాదిస్తున్నారు. విజయ్ దేవరకొండ గత కొద్దికాలం గా ఫ్లాపులతో సతమతమవుతున్నాడు.. అందుకే అతను గౌతమ్ తిన్నారుతో రాబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెడుతున్నాడు. మరోపక్క రష్మిక కూడా బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు పెళ్లి భాజాలు ఎప్పుడు మోగుతాయి అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి కమిట్మెంట్లు పూర్తి అయిన తర్వాత చేసుకుంటారా లేక మధ్యలో కాస్త గ్యాప్ చూసుకొని ఏడడుగులు నడిచేస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది.