తెలుగు సినీ రంగంలో ముఖ్యమైన కుటుంబాలుగా పేరుగాంచిన అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య ఈ విభేదాలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయన్నది సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బన్నీ తన స్వతంత్ర పంథాతో కొనసాగుతారని, అదే ఆయనకు సరికొత్త ప్రయాణానికి బాటలు వేస్తుందని జ్యోతిష్యుల అభిప్రాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జ్యోతిష్యుడు కృష్ణమాచార్య అల్లు అర్జున్ పై చేసిన స్టేట్మెంట్ వైరల్ అవుతుంది.
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వివాదాలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ‘పుష్ప 2’ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఆయన అరెస్టవ్వడం, ఆ తరువాత బెయిల్ మీద బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో అల్లు – మెగా కుటుంబాల మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు కృష్ణమాచార్య అల్లు అర్జున్ జాతకంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన ప్రకారం, అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో స్వతంత్రంగా తన కెరీర్ కొనసాగించబోతున్నారు. మెగా కుటుంబంతో గల అనుబంధం క్రమంగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అల్లు – మెగా కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఈ రెండు కుటుంబాలు దూరమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, ఇటీవల సంధ్య థియేటర్ ఘటన తరువాత చిరంజీవి స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం, అనంతరం బన్నీ ఆయనను కలవడం కలకలం రేపింది. దీనితో ఈ రెండు కుటుంబాలు తిరిగి కలిశాయనుకుంటే, మరోవైపు వివాదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్ ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న వివాదాలని మరింత జటిలం చేస్తున్నాయి. అయితే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు త్వరగా తగ్గిపోవాలని సినీ ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటున్నారు.