ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత స్ట్రాంగ్ పార్టీ కాంగ్రెస్.. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 35 మంది ఎంపీల షేర్ ఒక్క ఏపీ నుండే ఉండేది. అటువంటి పార్టీని అథ:
పాతాళానికి తొక్కిన వ్యక్తులు ఒకరు నిన్నటి దాకా తెలంగాణా సీఎం కేసీఆర్ కాగా.. మరొకరు ఏపీ సీఎం జగన్.
వారిద్దరి రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టకుండా కాంగ్రెస్ కు పూర్వ వైభవం సాధ్యం కాదని డిసైడ్ అయ్యారు సోనియా.. ఆమె మొదటి లక్ష్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక జగన్ వంతు ఇప్పుడు మొదలైంది.
అన్న జగన్ తో ఆస్తి తగాదాలతో పాటు అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్న షర్మిలను ఈ టార్గెట్ కు పావుగా ఎంచుకున్నారు సోనియా.
జగన్ ను ఓడించడమే లక్ష్యంగా ఆమెను ఏపీలో బ్రహ్మాస్త్రంగా ప్రయోగించబోతున్నారు సోనియా. ఆమె ఆశీస్సులతో ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్న షర్మిల ఆపరేషన్ మంగళగిరి తో పని స్టార్ట్ చేశారు.
50, 60 సిట్టింగ్ లను మార్చి మళ్లీ అధికారంలోకి రావాలని సీరియస్ గా స్టెప్స్ వేస్తున్న జగన్ కాళ్లకు అడ్డుపుల్ల వేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డిని కాంగ్రెస్ వైపు తిప్పడం ద్వారా.. బిడ్డా జగన్ నీ అసమ్మతి ఎమ్మెల్యేలకు మేం అండగా ఉంటామని చెప్పకనే చెబుతున్నారు. కాలం కలిసి వస్తే సీఎం కావాల్సిన వ్యక్తి లోకేష్..
అటువంటి శక్తిని మంగళగిరిలోనే మట్టు పెట్టి రాజకీయంగా భవిష్యత్ లేకుండా చేయాలని జగన్ ఆలోచన.
దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని అన్ని ప్రయత్నాలూ చేస్తున్న లోకేష్ కు ఇప్పుడు కొత్త అక్క షర్మిల దొరికింది. జగన్ పై పగా ప్రతీకారంతో రగిలి పోతున్న ఈ యువ నాయకుడికి నేనున్నానంటూ అపన్నహస్తం చాచింది.
తమ్ముడూ నిన్ను ఎంఎల్ఏ చేస్తున్నా అని చెప్పకనే చెబుతూ క్రిస్మస్ గిఫ్ట్ లు కూడా పంపింది.
మరుసటి రోజునే ఆపరేషన్ మంగళగిరి స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి సోనియా, షర్మిల, లోకేష్ ముగ్గురి లక్ష్యం ఒక్కటే అదే జగన్ సీఎంగా దిగిపోవడం..
వారి కల నేర్చుకోవడానికి ఆపరేషన్ మంగళగిరి స్టార్ట్ అయిపోయింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి షర్మిలతోనే తన ప్రయాణం అని తెగేసి చెప్పారుగా.