ఎక్కడ కెలికితే అన్నకు కాలుతుందో.. సరిగ్గా అక్కడి నుండే మొదలెట్టింది షర్మిల

0
379
Sharmila started from where Anna gets hurt

జగన్ సామాన్యుడు కాదు.. రాజశేఖర్ రెడ్డి కొడుకు.. రాజారెడ్డి మనవడు అంటూ ఉంటారు కదా.. మరి షర్మిల కూడా వారి వారసత్వమేగా.. అందుకే జగన్ కు ఇక చుక్కలే..

ఆట మొదలైంది. వేట కూడా ఎక్కడ నుండి మొదలెట్టిందో చూశారుగా.. కొత్త తమ్ముడు లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ లు పంపిన షర్మిల అక్క.. ఆయనకు గిఫ్ట్ గా ఎమ్మెల్యే ని చేయాలని డిసైడైంది.

వైఎస్ కుటుంబానికి నమ్మిన బంటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ని కాదని… గంజి చిరంజీవిని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్ డిసైడ్ చేశారు. దీంతో మంట మీద ఉన్న ఆళ్లను తనవైపు తిప్పుకుని ఏపీలోకి గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది షర్మిల.

తెలంగాణ ఎన్నికల్లో స్పేస్ దొరకక పోవడంతో తన కార్యక్షేత్రం అనివార్యంగా ఆంధ్రాకి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టిన నాటికంటే ఇప్పుడు అన్నతో ఆస్థి గొడవలు సైతం బాగా ముదిరాయని టాక్.

వైఎస్ కుటుంబంలో భారతి పెత్తనంలో షర్మిలను పూచిక పుల్లలా తీసివేస్తున్నారని భోగట్టా.

స్వతహాగా హెడ్ స్ట్రాంగ్ పర్సన్ అయిన షర్మిల ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఆమె కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుని రాహుల్ తో భేటీలు సైతం పూర్తిచేశారు. ఈ లోపు రేవంత్ రెడ్డి అడ్డుతగిలారు.

ఆమె తెలంగాణ కాంగ్రెస్ లో చేరితే… తాను పార్టీలోనే ఉండనని తెగేసి చెప్పారట. దీంతో ఆమెను ఏపీ వైపు తిప్పింది అదిష్టానం.. ఆమె ఏపీ అధ్యక్షురాలిగా రేపో మాపో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Sharmilas operation begins AP leaders who will form a queue

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అంటారుగా.. ఇది కూడా అలాంటిదే.. రాష్ట్ర విభజన ద్వారా చచ్చిన కాంగ్రెస్ కు ఊపిరి షర్మిల ద్వారానే వచ్చిందని నిరూపించుకోవాలి, అలాగే తనను రాజకీయంగా వాడుకుని వదిలేసిన జగన్ కు బుద్ది చెప్పాలి.

ఈ రెండూ నెరవేర్చుకునేలా ఆమె వ్యూహాలు ఉండబోతున్నాయని మంగళగిరి తాజా పరిణామం చెబుతోంది. లోకేష్ గెలిచినా ఫర్వాలేదు కాని తన అన్న పార్టీ మాత్రం ఓడిపోవాలని ఆమె అభీష్టంగా స్పష్టమవుతోంది.

మొత్తానికి 2024 సంవత్సరం ప్రారంభానికి ముందే ఆంధ్ర రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. అన్నా చెల్లెళ్ల పోరాటం లోకేష్ ని ఎమ్మెల్యే అక్కడి నుండి సీఎం చేసే అవకాశాలున్నాయా.. అనేలా పరిణామాలు మారుతున్నాయి.

50, 60 సీట్లలో సిట్టింగ్ లు మార్చాలని జగన్ కసరత్తు చేస్తుండగా.. ఇక వారికి నేనున్నానని షర్మిల అభయహస్తం చాస్తోంది.

తన కొత్త పార్టీ హస్తం ద్వారా వారికి నేస్తంలా నిలుస్తానని మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉదంతంతో తెలియచెప్పింది. కురుక్షేత్రానికి తలపించే ఆంధ్రా ఎన్నికలు మరింత ఉత్కంఠగా మారే పరిణామం గా దీనిని చెప్పుకోవచ్చు.