అఖిల్‌ 50 సార్లు చూసిన సినిమా ఏదో తెలుసా?

0
731
akhil akkineni

అక్కినేని అఖిల్‌… అక్కినేని వారి మూడోతరం వారసుడిగా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ‘సిసింద్రీ’తో సీమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత భారీ హైప్‌తో ‘అఖిల్‌’ సినిమాతో హీరోగా లాంచ్‌ అయ్యాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్‌గా మారింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ఏవీ అతనికి ఆశించిన విజయాన్ని తెచ్చిపెట్టలేదు.

‘అఖిల్‌’కు ముందు అక్కినేని వారి మూడు తరాల ముచ్చటైన చిత్రం ‘మనం’లో క్లైమాక్స్‌లో మెరుపులా మెరిసి ఆకట్టుకున్నాడు. ఆ సినిమా ఘన విజయం సాధించినా అది అఖిల్‌ ఖాతాలోకి వెళ్లదు.

సినిమా వాతావరణంలో పుట్టి పెరిగిన అఖిల్‌కు సినిమాలంటే ప్రాణం తన తాత, తండ్రి, అన్న నటించిన సినిమాలే కాదు అందరి హీరోలు నటించిన సినిమాలనూ చూస్తాడు. అలా అఖిల్‌ చూసిన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా మహేష్‌ బాబు నటించిన ‘పోకిరి’ చిత్రమట.

akhil akkineni

ఇటీవల ఓ టీవీ షోలో ఆ విషయాన్ని తనే రివీల్‌ చేశాడు. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాదాపు 50 సార్లు చూసి ఉంటాను. ఒక పక్కా కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన స్టఫ్‌ అంతా ఇందులో ఉంది. ఇప్పటికీ ఎప్పుడు చూసినా ఫ్రెష్‌గానే కనిపిస్తుంది.

స్టార్‌ హీరో అవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరికీ ఇదొక బెంచ్‌మార్క్‌ మూవీ అన్నారు. అఖిల్‌ నటించిన ‘ఏజెంట్‌’ సినిమా విడుదలై దాదాపు 10 నెలలు కావొస్తున్నప్పటికీ ఆ డిజాస్టర్‌ నుంచి ఇంకా కోలుకున్నట్టు లేడు. ఆ సినిమాపై అంత నమ్మకం పెట్టుకున్నాడు అఖిల్‌.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అఖిల్‌ కొత్త ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ అయ్యిందట. అదీ ఓ సంచలన కాంబినేషన్‌లో. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు సాగుతున్నాయి.

కేజీఎఫ్‌, సలార్‌లతో వరల్డ్‌ వైడ్‌ పేరు పొందిన హోంబలే బ్యానర్‌, తెలుగులో టాప్‌ స్టేజ్‌లో ఉన్న యు.వి. క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. రాధేశ్యామ్‌, సాహో చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన అనీల్‌ కుమార్‌ ఓ సూపర్‌ లైన్‌ను అఖిల్‌కు చెప్పాడట.

అది అఖిల్‌ను బాగా ఇంప్రెస్‌ చేసిందట. ఇంకో విశేషం ఏమింటే ఈ సినిమాకు ఇండియన్‌ స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన బాధ్యతలను ప్రశాంత్‌నీల్‌ వెనకుండి నడిపిస్తున్నారట. మొత్తానికి లేటయినా.. లేటెస్ట్‌గా మరోసారి భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు అఖిల్‌ అక్కినేని.