భీమ్లా నాయక్ జనసేన వాళ్ళకి బ్లాక్ బస్టర్.. జనాలకు కాదు

0
1795

భీమ్లా నాయక్.. విడుదల అయిన రెండో రోజు నుండే కలెక్షన్ లు జారిపోయాయి. ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేక అష్టకష్టాలు పడుతుంది. అప్పుడే బ్లాక్ బస్టర్ అయిపోయిందని కొందరు డప్పు కొట్టుకుంటున్నారు. కనీసం బ్రేక్ ఈవెన్ చేస్తే ఓ మాదిరి యావరేజ్ అని అనుకోవచ్చు. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల అయి వారం కావస్తున్నా ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా దాటకుండా బ్లాక్ బస్టర్ ఎలా అవుతుందో అనుకునేవాళ్లు సిగ్గు పడాలి. ఓ పక్క జనాల్లో నెగెటివ్ మౌత్ బాగా ఉన్నా వైసిపి కి చెందిన కొన్ని వెబ్ సైట్ లు కూడా సినిమా ని బ్లాక్ బస్టర్ గా రాయడం మరింత సిగ్గు చేటు.

పొలిటికల్ రంగు పూయడం కొంప ముంచింది

ఇదిలా ఉంచితే ఈ సినిమాని మొదటి నుండి అభిమానులు భుజాన వేసుకోకుండా.. జనసేన పార్టీ టీం నెత్తిన పెట్టుకొని పొలిటికల్ రంగు పూసి పబ్లిసిటీ తెచ్చుకుంది. ఎంత పబ్లిసిటీ తెచ్చుకున్నా తొలి రోజు ప్రీ బుకింగ్ తప్పితే.. కలెక్షన్ లు రావడం లేదు. అయితే ఈ సినిమా ని అభిమానులతో పాటు జనసేన వాళ్ళు మాత్రమే చూసినట్లు కలెక్షన్ ల బట్టి చెప్పవచ్చు. మరి ఏ ఇతర పార్టీ వాళ్ళు కూడా పవన్ సినిమాపై నమ్మకం లేక చూడలేదని భావించవచ్చు.

అందుకే కలెక్షన్ లు రావడం లేదని అంచనా

ఎందుకంటే పవన్ మాటి మాటికీ జగన్ పై పొలిటికల్ విమర్శలు చేస్తూ ఉండడం కూడా సినిమాకి దెబ్బ పడింది. జగన్ అభిమానులు ఈ సినిమాని చాలా తక్కువ మంది చూసారు. అందుకే కలెక్షన్ లు రావడం లేదని ఒక అంచనా. సినిమాకి నెగిటివ్ టాక్ ఒక పక్క, పొలిటికల్ ప్రత్యర్థి జగన్ కి ఫాన్స్ ఎక్కువ శాతం చూడక పోవడం మరో పక్క.. ఈ రెండింటితో సినిమా కలెక్షన్ లు కరువయ్యాయి. అటు టిడిపి వాళ్ళు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపించ లేదు.

జనసేన వాళ్ళు కేవలం 5 నుండి 6 శాతం మాత్రమే

ఇక జనసేన ఈ సినిమా బాధ్యతని నెత్తిన వేసుకోవడంతో.. ఇది కేవలం జనసేన వాళ్ళ సినిమా అనేలా బయటి పబ్లిక్ కి కనిపించింది. ఒక సినిమాకి పొలిటికల్ రంగు పులిమితే ఇతర పార్టీ వాళ్ళు ఆ సినిమాని చూసే అవకాశమే ఉండదు. జనసేన వాళ్ళు కేవలం 5 నుండి 6 శాతం మాత్రమే ఉన్నారు. ఇది గత ఎలక్షన్ ఓటింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంది. జగన్ అభిమానులు 50 శాతం ఉండగా, టిడిపి అభిమానులు 39 శాతం ఉన్నట్లు గత ఎలక్షన్ ఓటింగ్ శాతాన్ని బట్టి చెప్పవచ్చు. దీనితో బాగా అర్ధం అయిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరోగా సినిమా చేయకుండా.. ఒక పార్టీ అధినేత గా సినిమా తీశారని బయటికి బాగా ప్రోజెక్ట్ అయింది. అందుకే ఈ భీమ్లా నాయక్ ని జనసేన వాళ్ళు బ్లాక్ బస్టర్ గా భావిస్తున్నారు. జనాలు మాత్రం కాదు.