నువ్వు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే: హోమ్ మినిస్టర్

0
203
home minister
You are now only an MLA

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని వైసిపి ఆరోపించింది. చంద్రబాబు పదేళ్ల పాటు వాడిన పాత బండి ఇచ్చారని, కనీసం బాగు చేయకుండా ఇచ్చారని విమర్శలు గుప్పించింది. ఈ విషయంపై హోంమంత్రి వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. గతంలో జగన్ చేసిన పనినే తాము చేశామని.. ఒకసారి గతంలో ఏమి చేసారో గుర్తు తెచ్చుకోవాలని సూచించారు.

జగన్ ని పులివెందుల ఎమ్మెల్యేగా సంబోధించారు. జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని, కేవలం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నందున జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని చెప్పారు. గతంలో మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబుకు టాటా సఫారీ వాహనమే అని.. ఇప్పడు కూడా అదే ఇచ్చామని గుర్తు చేశారు.

కేవలం ప్రభుత్వంపై బురద చల్లడమే వారి పని అని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఎక్కడికి వెళ్లినా టాటా సఫారీ వాహనమే ఉపయోగిస్తారని తెలిపారు. జగన్ కి ఎక్కడా ప్రోటోకాల్ ఉల్లంఘించలేదని, సెక్యూరిటీ తగ్గించలేదని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ “నువ్వెక్కడికైనా వెళతానంటే పోలీసులతో తాళ్లు కట్టలేదు. ఇందులో అటవిక పాలన ఎక్కడ జరిగిందో నువ్వు, నేను చర్చించుకోవాలి” అని వ్యంగ్యంగా అన్నారు హోమ్ మినిస్టర్.