కేసీఆర్‌ ఆరెస్ట్‌కు రంగం సిద్ధం?

0
406
kcr

రాజకీయమంటే ఒకప్పుడు నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడం. దీనికి కోసం మనసు సేవాధృక్పథంతో నిండి ఉంటే చాలు. కానీ రాను రాను అది రాజకీయాలు కాస్తా రాటుదేలాయి.. ఎంతగా ఉంటే పరుచూరి గోపాలకృష్ణ డైలాగ్‌ ఒకటుంది ‘‘రా’.. అంటే రాక్షసంగా.. ‘జ’.. అంటే జనానికి.. ‘కీ’… అంటే కీడు చేసే… ‘యం’.. అంటే యంత్రాంగం అని.. ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే అదే నిజం అనిపిస్తోంది.

అధికారంలోకి రావడమే తరువాయి ప్రజాధనం దిగమింగడమే పనిగా పెట్టుకుంటున్నారు నాయకులు. ఇందులో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. తాజాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలివ్వడం రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది.

గత ప్రభుత్వం హయాంలో కేసీఆర్‌ తన పార్టీ బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూరేలా అత్యంత విలువైన కోకాపేటలో పార్టీకి సంబంధించిన ‘ఇనిస్టిటూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌’ ఏర్పాటు చేయటానికి అంటూ సర్వే నెం.239, 240ల్లో 11 ఎకరాలను కేటాయించుకున్నారు.

kcr

కోకాపేటలో ఇటీవల ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో ఎకరం 150 కోట్లకు అమ్ముడు పోవడం సంచలనం సృష్టించింది. కానీ అదే కోకాపేటలో తమ పార్టీ కోసం కేటాయించిన స్థలానికి సంబంధించిన ఎకరం లక్షల రూపాయల చెల్లింపు ఒప్పందంతో కేసీఆర్‌ ప్రభుత్వం 11 ఎకరాలను తీసుకుంది.

దీనిపై వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. తాజాగా శుక్రవారం ఈ పిటీషన్‌పై హైకోర్టు ప్రధాన న్యామూర్తి ఆధ్వర్యంలో డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌, అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, ఇతర రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో రాజకీయంగా పెద్ద దుమారం రేగే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ ముందు నుంచీ కేసీఆర్‌ను ఊచలు లెక్కపెట్టిస్తాం అని అంటూ ఉంది. అధికారంలోకి రాగానే ఇలా కేసులు పెడతారనే భయంతోనే కేసీఆర్‌ బాత్‌రూమ్‌లో కాలుజారి పడినట్లు కలర్‌ ఇచ్చారనే వాదనలూ లేకపోలేదు. ఈ తాజా కోర్టు ఆదేశాలు ప్రభుత్వానికి వజ్రాయుధాన్ని అందించినట్లు అయింది.