విశాఖపై కేంద్రం సంచలన నిర్ణయం..!

0
555

మూడు రాజధానుల అంశంలో భాగంగా విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి అమలు చేయాలని చూస్తుంది ఏపీ సర్కార్. కానీ అమరావతి రైతులు, ప్రజలు మాత్రం దానికి ససేమీరా ఒప్పుకోమని నిరసనలు, ధర్నాలు, పాదయాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇటీవల విశాఖపట్నానికి సంబంధించిన ఒక వార్త వెలుగులోకి వచ్చింది. విశాఖను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తామంటూ కేంద్రం భావిస్తుందని. ఈ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే కనుక నిజమైతే ఏపీలో బీజేపీ ఎదుర్కొనే పరిణామాలను ఒకసారి పరిశీలిద్దాం.

ఆర్థిక వనరుగా నిలుస్తున్న విశాఖ

ఆంధ్రప్రదేశ్ కు విశాఖపట్నం ఆర్థికం పరంగా వెన్నెముకగా నిలుస్తుంది. ఎక్కువగా తీరప్రాంతం కలిగి ఉండడంతో పోర్ట్ బిజినెస్ ఇక్కడ ఎక్కువ. దీంతో పాటు సందర్శకుల తాకిడి కూడా ఉంటుంది. ఇది సుందరనగరం కావడంతో టూరిస్టులు ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. దీంతో పాటు నేవీ, డిఫెన్స్, తదితరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం విశాఖను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చితే ఇక్కడి సంపాదన అంతా పోతుంది. ఇప్పటికే రాష్ర్ట విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.

కొన్ని రోజులు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు ఇటీవల ముగిసింది. అమరావతి రాజధాని అయినా జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చి అందులో విశాఖపట్నాన్ని కూడా చేర్చింది. ఇటీవల వస్తున్న వార్తల నేపథ్యంలో విశాఖ కూడా కోల్పోతే ఏపీ చాలా తీవ్రంగా ఆర్థిక సంక్షోబాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ పావులు కదుపుతుందా..?

నార్త్ ను గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ ఇప్పుడు సౌత్ వైపు చూస్తోంది. సౌత్ లో ఉన్న రాష్ర్టాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటే ఏక ఛత్రాధిపత్యం సాధించవచ్చని పావులు కదుపుతోంది. ఇప్పుడు బీజేపీ చూపు రెండు తెలుగు రాష్ర్టాలపై పడిందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో రెవెన్యూ ఇచ్చే పట్టణాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంటుందని వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదే జరిగితే రెవెన్యూ కోసం కేంద్రంపై ఆధారపడతారని ఫలితంగా తమ గుప్పిట్లో ఉంటారని బీజేపీ భావిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇటీవల విశాక స్టీల్ ప్లాంట్ ను కూడా బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసింది. ఇలా ఏపీని దెబ్బమీద దెబ్బ కొడుతూ కేంద్రం ఆడుకుంటుందని ప్రతి పక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

దేశ భద్రత దృష్ట్యా అంటూ కామెంట్లు

కేంద్రంలో బీజేపీ సర్కార్ కొలువు దీరినప్పటి నుంచి దేశ భద్రతపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ భద్రతపై మరింత దృష్టి పెట్టింది. ఏపీలో మూడు రాజధానుల అంశం లేవనెత్తిన సమయంలోనే విశాఖపట్నాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించేందుకు పావులు కదుపడంలో కొన్ని అంశాలను కొందరు వివరించారు. విశాఖపట్నం ఎక్కువ తీర ప్రాంతం కలిగి ఉంది. ఇక్కడ నేవీకి సంబంధించి కారిడార్లు ఉన్నాయి. వీటి భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు కూడా వాదనలు వినిపిస్తున్నాయి.

క్లారిటీ ఇవ్వని బీజేపీ నాయకులు

ఇవన్నీ గాలి వార్తలే అని నిజాలు లేవంటూ కొందరు కొట్టివేస్తున్నారు. విశాఖను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసేందుకు ఒక్క శాతం కూడా అవకాశం లేదంటూ చెప్పుకస్తున్నారు. పైగా ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం రాష్ర్టాలుగా మారుస్తుండగా.. కొత్తగా మరో కేంద్ర పాలిత ప్రాంతం అంటూ వార్తలు రావడం విడ్డూరంగా ఉందంటూ కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల వరకూ ఈ అంశాన్ని పొడిగించుకుంటూ పోతే మాత్రం బీజేపీకి ఇది పెద్ద దెబ్బగా భావించవచ్చు. ఏపీలో బీజేపీ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ వార్తలపై బీజేపీ నాయకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.