భార్యకి లక్షల్లో డబ్బు ఎక్కడిదని ఆరా తీసిన భర్త

0
2551

‘అప్ నా కమాయ్’ కథ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. కష్ట సంపాదించిన ప్రతీ పైసా ఎంతో విలువైనదని. ఎటువంటి మోసాలకు పాల్పడకుండా.. తెలివితేటలతో సంపాదిస్తే దానికి గుర్తింపు ఉంటుంది. కానీ ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుంటూ లక్షలాది డబ్బులు వసూలు చేయాలనుకుంటే మాత్రం చిక్కుల పాలు కాక తప్పదు.. అలాంటి ఒక ఘటన ఉత్తరప్రదేశ్ లో ఇటీవల వెలుగు చూసింది. ఆ విషయాలను తెలుసుకుందాం..

డబ్బు సంపాదనకు వింత పోకడలు

ప్రస్తుతం డిజిటల్ యుగం కొనసాగుతోంది. పట్నం నుంచి మొదలు ప్రతీ మారుమూల పల్లె వరకూ కూడా ఇంటర్నెట్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఇందులో సక్రమంగా డబ్బు సంపాదించేందుకు చాలా మార్గాలే ఉన్నా.. కొందరు మాత్రం అక్రమంగా సంపాదించేందుకు ఎగబడుతున్నారు. దాంతో కుటుంబ జీవితాలను నాశనం చేసుకోవడం.. చివరికి జైలు పాలు కావడం కూడా జరుగుతుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకొని డబ్బు సంపాదించడం తెలుసుకున్న ఒక గృహిణి భర్తను ఏమార్చి లక్షలు లక్షలు సంపాదించడం మొదలు పెట్టింది.

సంపాదన కోసం చాట్ ఎంచుకున్న గృహిణి

ఉత్తరప్రదేశ్ రాష్ర్టంలోని, ఫైజాబాద్ కు చెందిన ఓ వివాహిత సులువుగా డబ్బు సంపాదించేందుకు అ**డల్ట్ చాట్ ను ఎంచుకుంది. గంటల తరబడి గంటల తరబడి బెడ్ రూంలో గడిపేది. లక్షలాది రూపాయలు రావడం మొదలైంది. ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయని భర్త అడిగితే తాను రీల్స్ చేస్తున్నానని, వాటిని సోషల్ మీడియాలో పెడితే డబ్బులు వస్తున్నాయని చెప్పడం ప్రారంభించింది. తన భర్త కూడా ఇది నిజమే అనుకొని నమ్మాడు. ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో ఒక ఘటన జరిగింది.

వీడియోలతో బ్లాక్ మెయిల్

అ**డల్ట్ చాట్ లో ఒక యువకుడు సదరు గృహిణికి పరిచయం అయ్యాడు. డబ్బు ఇస్తానని ఆశ చూపి వీడియో కాల్ లో అర్థనగ్న ప్రదర్శన ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె కూడా అలానే చేసింది. ఈ వీడియోను రికార్డు చేసుకున్న సదరు యువకుడు ఆమెనే బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకే డబ్బులు ఇవ్వాలని లేదంటే ఈ వీడియో నీ భర్తకు పంపుతామని బెదిరించ సాగాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో ఆ వీడియోను ఆమె భర్తకు పంపాడు.

రెచ్చిపోయిన భర్త

ఆ వీడియోను చూసిన ఆమె భర్త అండగా నిలవాల్సింది పోయి రెచ్చిపోయాడు. తరుచూ ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. దీంతో పాటు తన స్నేహితులను తీసుకచ్చి వ్యభిచారం చేయాలని ఒత్తిడి కూడా చేశాడు. ఈ బాధలను తాళలేక సదరు గృహిణి లక్నో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కేసు వేసింది. ఈ కేసులో లాయర్ సిద్ధాంత్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కేసు తను కెరీర్ లో ఇంత వరకూ చూడలేదని చెప్పాడు.

తన భార్య నెలకు రూ. లక్ష వరకూ ఎలా సంపదిస్తుందో పట్టించుకోకుండా ఆమె ఇచ్చే డబ్బులతో ఎంజాయ్ చేసేవాడు భర్త. చివరికి విషయం తెలిసిన తర్వాత మరో విధంగా ఆమె టార్చర్ పెట్టడం సరికాదుకదా.. అంటూ చెప్పారు. సదరు మహిళకు, ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చింది కోర్టు. ఇవన్నీ మాని ఇప్పుడు వారిద్దరూ కలిసే ఉంటున్నారు.