ఫోన్ పక్కనే పెట్టి పడుకుంటున్నారా.. అయితే మీకు ఆ సమస్య రావడం ఖాయం..

0
294
Are you sleeping with your phone next to you

మారుతున్న కాలంలో చాలా మంది సెల్ ఫోన్ కు బానిసలు అవుతున్నారు. కొంత సమయం సెల్ చేతిలో లేకుంటే నానా హైరానా పడుతున్నారు.

ఇప్పటి జమానా లైఫ్ స్టయిల్ అంతా సెల్ తోనే ముడేసుకుంది అనడంలో సందేహం లేదు. అవి కూడా అంతలా ఉపయోగపడుతున్నాయి. ఉదయం అనుకున్న సమయానికి లేపడం నుంచి రాత్రి నిద్ర పుచ్చే వరకూ.

అలా మార్చివేసిందనే చెప్పాలి. ఉదయం అలారంతో లేపేది సెల్ ఫోన్.. బాత్రూంకు వెళ్లాలన్నా సెల్ ఉండాల్సిందే.. ఇక బయట చేసే ప్రతి పనిలో సెల్ వాడుతూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటే పోతే దానితో చాలా ప్రయోజనాలే ఉన్నాయి.

ప్రస్తుతం పరిస్థితులు ఎలా మారాయంటే సెల్ ఫోన్ పక్కన పెట్టమంటే అదొక భయానకమైన శిక్షగా భావించేంతగా. కానీ కొన్ని సందర్భాలలో ఫోన్ మనకు చేటు కూడా చేస్తుంది. ఆరోగ్యంపై కూడా దాని ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

నిద్రపోయేప్పుడు పక్కన పెట్టుకోవద్దు

ముఖ్యంగా నిద్రపోయేప్పుడు సెల్ ఫోన్ దగ్గర ఉండద్దట. ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా రాత్రి పడుకునే సమయంలో సెల్ లో ఏదో ఒకటి చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాం. మీరు సెల్ ఫోన్ ను పక్కన పెట్టినా అంతర్గతంగా అది పని చేస్తూనే ఉంటుంది.

కొంత రేడియేషన్ ను కూడా వెదజల్లుతుంది. దీంతో స్త్రీలు, పురుషులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారట. అయితే ఇందులో స్త్రీల కంటే పురుషులలో సమస్యలు ఎక్కువగా వస్తాయట. అవేంటో చూద్దాం.

రాత్రి నిద్రపోయేప్పుడు సెల్ పక్కనే ఉంటుంది. కాదు.. కాదు.. సెల్ ఫోనే మనలను నిద్ర పుచ్చుతుంది ఇది కరెక్ట్. అయితే సెల్ ఫోన్ లో డేటా ఆఫ్ చేస్తాం కానీ సిగ్నల్స్ ను మాత్రం ఆఫ్ చేయలేం కదా.

ఇదే మనకు ముప్పు తెచ్చిపెడుతుందట. మగవారిలో సెక్స్ సమస్యలకు దీని నుంచి వెలువడే రేడియేషన్ కారణం అవుతుందని ఇటీవల కొన్ని అధ్యయనాలు కూడా చెప్పాయి.

is t news getting ready for channel shifting

సార్ నిబంధనల మేరనే ఉన్నా.. రేడియేషన్ రేడియేషనే కదా.. దీంతో అంగస్తంభన సమస్యలు వస్తాయట. ఎక్కువగా చూడడం వల్ల సెల్ లోని బ్లూ లేజర్స్ నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిపై ప్రభావం చూపించి తగ్గిస్తుందట.

ఇదే మన నిద్రలేమికి కారణం అవుతంది. దీంతో క్రమ క్రమంగా నిద్రకు కూడా దూరం అవుతాం. ఇంకా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని గతంలో డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరించింది. అందుకే ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే ఫోన్ ను వినియోగించాలి.

మూడు అడుగుల దూరం ఉంచాలి

పడుకునే సమయంలో ఫోన్ ను దాదాపు 3 ఫీట్ల దూరంలో ఉంచాలి. నిద్రపోయేందుకు సాధనంగా ఫోన్ ను ఉపయోగించకుండా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.

ఇది నిద్రపోయేందుకు మంచి పద్ధతి. విజ్ఞానం కూడా పెరుగుతుంది. ఇది మంచి అలవాటు కూడా. ఆ పుస్తకాలు కూడా ఫోన్ లో చదవద్దండోయ్. ఇక నోటిఫికేషన్స్, వైబ్రేషన్ లాంటివి ఆఫ్ చేసి మూడు అడుగుల దూరంలో ఫోన్ ను పెట్టి నిద్రపోవాలి.

ఫోన్ పక్కనే పెట్టి నిద్రపోయిన వారు ఉదయం మూడీగా, అలిసిపోయినట్టుగా నిద్రనుంచి మేల్కొంటారు. నిద్రపోయే సమయంలో ఫోన్ చూడడం వల్ల మానసిక ఒత్తిడి, స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. సెల్ సైలెంట్ కిల్లర్ గా మారి మన జీవితాలను నాశనం చేస్తుంది.