మీకు ఘోరీ కట్టే మేస్త్రిని నేనే..

0
326
Our people will tie that tiger to a tree Revanth Reddy
Our people will tie that tiger to a tree Revanth Reddy

దావోస్‌ పర్యటన అనంతరం తెలంగాణకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత నాలుగు రోజులుగా పెండిరగ్‌ పనులతో బిజీ బిజీగా గడిపారు. ఈ కారణంగా ప్రజల మధ్యకు రాలేదు. తాజాగా గురువారం ఎల్‌.బి. స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ క్యాడర్‌ మీటింగ్‌కు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మరోసారి తనదైన శైలిలో బీఆర్‌ఎస్‌ నాయకులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గుంపు మేస్త్రి.. గుంపు మేస్త్రి అని అవహేళన చేస్తున్నారు. అవును బిడ్డా.. నేను మిమ్మల్ని 100 మీటర్ల గోతిలో పాతిపెట్టే మేస్త్రినినేనే.

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లికి వస్తున్నా.. కాచుకోండి. ఖానాపూర్‌ ఎమ్మెల్యేకు ఇందిరమ్మ ఇల్లు తప్ప ఏమీలేని సామాన్య ఆదివాసీ బిడ్డ కూడా కాంగ్రెస్‌ వల్ల ఎమ్మెల్యే అయ్యారు. మనకున్న 64 మంది ఎమ్మెల్యేలలో ఇలాంటి సామాన్యులు 20 మంది ఉన్నారు.

Our people will tie that tiger to a tree Revanth Reddy
Our people will tie that tiger to a tree Revanth Reddy

పేద బిడ్డలు, దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుని నేతలుగా ఎదిగారు. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు జేబులో 50 వేల రూపాయలు కూడా లేని దళితబిడ్డ.

కాంగ్రెస్‌ను నమ్ముకుని ఇవాళ 50 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నాడు. కేసీఆర్‌ రాజ్యసభకు కోటీశ్వరులను మాత్రమే పంపాడు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టే వారినే ఎంచుకుని అసెంబ్లీ టికెట్‌లు, పార్లమెంట్‌ టికెట్‌లు ఇచ్చాడు.

ఇదే ఎల్‌.బి. స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తాం అన్నాం. కానీ ఇప్పటికి 50 రోజులు కూడా కాలేదు.. అప్పుడే బిల్లా`రంగాలు భయలుదేరారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని, ఇంతకు ముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్‌ గారు చెప్పారు. మనం ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకూ 10.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేశారు.

అలాగే రాజీవ్‌ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి రెండో వారం నుంచీ మరో రెండు పథకాల అమలుకు మన ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇలాంటి మాపైనీ మీరు అవాకులు చవాకులు పేలేది దద్దమ్మల్లారా అంటూ బీఆర్‌ఎస్‌ నాయకులపై విరుచుకుపడ్డారు.