ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. వేణు గోపాల స్వామి సంచలనం

0
341
ntr political entry

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో ఊర మాస్ హీరో ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు కచ్చితంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. 18 ఏళ్ళ వయస్సులో ఎవరికీ సాధ్యం కానీ మాస్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న చరిత్ర ఆయనది.

తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానం ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు #RRR చిత్రం తో అంతర్జాతీయ స్థాయిలో తానూ ఏ స్థాయి నటుడో మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, గ్లోబల్ స్టార్.

ntr political entry

ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకపోయినా, ఆయన చుట్టూ రాజకీయాలు జరుగుతూనే ఉంటున్నాయి ఈమధ్య. రాజకీయ పరంగా ఆయన ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కామెంట్ కూడా చేసింది లేదు. కానీ ఆయన పేరు మీద రాజకీయాల్లో పలు మీడియా చానెల్స్ లైవ్ డిబేట్స్ నడుపుతుంటాయి.

ఎందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లో ఇంత ఫోకస్ అయ్యాడంటే, 2009 వ సంవత్సరం లో తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన చేసిన ప్రచారం అలాంటిది. ప్రతీ ఒక్కరు ఆయన ప్రసంగాలకు మంత్రముగ్దులు అయిపోయారు.

సాక్షాత్తు అన్నగారే క్రిందకి దిగి వచ్చినట్టు ఉంది అంటూ అభిమానులు ప్రశంసలతో ముంచి ఎత్తారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కష్టసమయం లో ఉన్నప్పుడు మాత్రం దూరం గా ఉండిపోయాడు. పార్టీ క్యాడర్ లో ఎన్టీఆర్ వస్తే ఆ ఊపే వేరే లెవెల్ లో ఉంటుంది అని ఎన్టీఆర్ అభిమానులతో పాటుగా, టీడీపీ కార్యకర్తల మనసులోని మాట కూడా.

అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు గోపాల స్వామి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ కెరీర్ లో రాజకీయ యోగం ఉంది. కానీ ఆయన ఇప్పట్లో రాజకీయ అరంగేట్రం చేసే పరిస్థితి లేదు. ఏడేళ్ల తర్వాతే పొలిటికల్ ఎంట్రీ ఉంటుంది.

కచ్చితంగా ఆయన జాతకం లో రాజయోగం ఉంది. ఆయన రాజకీయ అరంగేట్రం ఒక సెన్సేషన్ అవుతుంది. మొదటి ప్రయత్నం లోనే ముఖ్యమంత్రి అవుతాడు. ప్రస్తుతం ఆయన ద్రుష్టి మొత్తం సినిమాల మీదనే ఉంది.’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈమధ్య కాలం లో వేణుగోపాల స్వామి చెప్పిన ప్రతీ విషయం దాదాపుగా నిజం అయ్యింది. కాబట్టి ఇది కూడా నిజం అయ్యి తీరుతుంది అని అభిమానులు మురిసిపోతున్నారు.