బిగ్ బాస్ హౌస్ నుండి చంచల్ గూడ.. చరిత్రలో తొలిసారి

0
269
pallavi prasanth arrest

గత కొన్ని రోజులుగా మీడియాతో సహా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు పల్లవి ప్రసాద్. ఒక రైతు బిడ్డని అంటూ తనని సపోర్ట్ చేయాలంటూ సింపతీ కొట్టేశారు. సామాన్య కుటుంబం నుండి వచ్చానని బిగ్ బాస్ లో సానుభూతి కోరాడు. ఎట్టకేలకు అమాయక మొహం పెట్టి బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ కొట్టేసాడు.

అప్పటిదాకా అంత బాగానే ఉంది. ఒకసారి టైటిల్ తీసుకొని బయటికి రాగానే తన విశ్వరూపం చూపించాడు. హౌస్ లో ఉన్నంత కాలం అమాయక మొహం పెట్టి ఓట్లు వేయించుకొని.. బయటికి రాగానే మరో యాంగిల్ చూపెట్టాడు. ఇది ఓ వర్గం ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు పల్లవి ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకి పంపించారు. దీనితో టైటిల్ గెలిచామన్న ఆనందం అతడికి ఎక్కువ సేపు నిలవలేదు. కారణం ఏమిటంటే.. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన రోజు హైదరాబాద్ రోడ్ల అల్లరి మూకలు చేసిన పనికి అతడికి కూడా ఒక భాగస్వామి అని పోలీసులు కేసు నమోదు చేశారు.

pallavi prasanth arrest

పల్లవి ప్రశాంత్ పై మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రశాంత్ తో పాటుగా అతడి తమ్ముడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తరువాత వెనుక వైపు నుండి బయటికి వచ్చిన పల్లవి ప్రశాంత్.. పోలీసులు చెప్పినా వినకుండా అభిమానుల వైపు వెళ్లడంతో అక్కడి అలజడికి కారణం అయిందని పోలీసులు చెబుతున్నారు.

అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్.. తన అభిమానులని చూసి మరింత రెచ్చిపోయాడు. తాను దొంగతనం చేయలేదని, తాను ఎందుకు దొడ్డి దారిన వెళ్లాలని ప్రశ్నించాడు. పోలీసులు ఎంత మొత్తుకున్నా.. వారి మాట వినకుండా అభిమానులని కలవడానికి ప్రయత్నం చేసాడు.

ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ అభిమానులు పెద్దఎత్తున దాడులు చేయడంతో.. ఆర్టీసీ బస్సులు, కార్ల అద్దాలు పగిలిపోయాయి. ఈ క్రమంలో పోలీసులు కేసులు నమోదు చేసి.. అతడిని రిమాండ్ కి పంపించారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని ప్రశాంత్ వాదిస్తున్నాడు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ నుండి జైలుకి వెళ్లడం చరిత్రలో తొలిసారి జరిగిందని చెప్పవచ్చు.