కోర్టు కేసుల్లో చిక్కుకున్న నయనతార దంపతులు..వీళ్ళ జీవితం మొత్తం ఇంతేనా!

0
250

పాపం ఏ ముహూర్తం లో పెళ్లి చేసుకున్నారో తెలియదు కానీ, నయనతార మరియు సతీష్ దంపతులకు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది.

వీళ్లిద్దరికీ కవల పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళై నాలుగు నెలలు కూడా కాలేదు, అప్పుడే పిల్లలు ఎలా పుట్టారు అని ఆరా తియ్యగా, సరోగసి ద్వారా పిల్లల్ని పొందారని తెలిసింది.

అది చట్ట రీత్యా నేరం కాబట్టి, ఇద్దరి మీద కోర్టు లో కేసులు నమోదు అయ్యాయి. ఈ చిక్కుముడిని విడిపించుకోవడానికి దాదాపుగా ఏడాది సమయం పట్టింది. పోనిలే ఈ సమస్య వదిలింది కదా అనుకుంటే రీసెంట్ సతీష్ మీద మరో కేసు పడింది.

అసలు విషయానికి వస్తే ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్ ని హీరో గా పెట్టి గత ఏడాది నవంబర్ లో ఆయన ‘LIC’ అనే సినిమాని ప్రారంభించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుండగా, ఎస్ జె సూర్య ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

అయితే ఈ టైటిల్ ని పెట్టడం పై LIC సంస్థ వ్యతిరేకిస్తూ తక్షణమే టైటిల్ ని మార్చకపోతే, కఠినమైన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు వేస్తాం, మీకు వారం రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Preparations for Sankranti celebrations have started

ఈ కేసు సమస్య ఒకటి అయితే , నయనతార పై రీసెంట్ గా ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. ఎందుకంటే రీసెంట్ గానే ఆమె ‘అన్నపూర్ణి – ది గాడెస్ ఆఫ్ ఫుడ్’ అనే చిత్రం చేసింది.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేదు, నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈమధ్యనే స్ట్రీమింగ్ ని మొదలు పెట్టుకుంది. ఈ సినిమా పై ఇప్పుడు లీగల్ కేసు నమోదు అయ్యింది.

సినిమాలోని కొన్ని సన్నివేశాలు మత భావాలను కించపరిచేలా ఉన్నాయని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు. ఆ సినిమా ప్రధన తారాగణం నయనతార, జైతోపాటు దర్శకుడు నీలేశ్‌, నిర్మాతలు జతిన్‌ సేథీ,

ఆర్‌ రవీంద్రన్‌, పునీత్‌ గోయెంకాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కోర్టు కూడా ఈ కేసు ని స్వీకరించి విచారణ చేపడుతుంది. ఒక పక్క భర్త,

మరో పక్క భార్య ఇద్దరు కూడా కేసు లో చిక్కుకున్నారు, వీటి నుండి వీళ్ళు బయటపడి మళ్ళీ ఎప్పుడు మామూలుగా ఉంటారో చూడాలి.