సంక్రాంతి బరులకు సన్నాహాలు మొదలు…

0
302
Preparations for Sankranti celebrations have started

తెలుగునాట సంక్రాంతి అంటే.. నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఉంటుంది. వ్యవసాయాధారితమైన మన ప్రాంతంలో పంట డబ్బు చేతికి వచ్చే సమయం కావడంతో సంక్రాంతికి ఉండే సందడే వేరు.

ఈ సందడిలో కోడి పందాల హడావుడి చెప్పాలంటే పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చాలవు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఈ కోడిపందాల బరులకు ఫేమస్‌.

సంవత్సరం పొడవునా కంటిపాపలా చూసుకున్న కోళ్లను బరిలోకి దింపడం.. అవి విజయం సాధించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవడం.. పందెంలో కోడి గెలిచిందా ఇక ప్రపంచాన్ని గెలిచినంత గర్వంగా ఫీలవడం కామన్‌.

ఈ సంవత్సరం కూడా కోడి పందాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓవైపు బరులు సిద్ధమౌతుంటే.. మరోవైపు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటారు. అయితే అసలు పండుగ రోజులు వచ్చేసరికి పందెం రాయుళ్లదే పై చేయి అవుతుంది.

ఈసారి ఎన్నికల సంవత్సరం కూడా కావడంతో ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు వ్యవహరించే అవకాశం మెండుగా ఉంది. కోడిపందాల బరుల దగ్గర్లోనే గుండాటలు, పేకాటలు షరా మామూలుగానే జరిగిపోతుంటాయి.

వీటి విషయంలోనే పోలీసులకు, నిర్వాహకులకు ఎప్పుడూ వివాదం రేగుతూ ఉంటుంది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోయే ఈ సందడికి ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి.

The Himalayas are ringing alarm bells

ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పరిసర ప్రాంతాల్లో జరిగే కోడి పందాలకు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పందెం రాయుళ్లు కోట్ల రూపాయల డబ్బు,

ఖరీదైన కార్లలో దిగిపోవటానికి సిద్ధమౌతున్నారు. మొట్ట ప్రాంతాల్లో బరుల ఏర్పాటుకు పొలాలను చదును చేయడం చకచకా జరుగుతోంది.

సామాన్యుడి నుంచి లక్షాధికారులు, కోటీశ్వరులు కూడా ఈ పందాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఎన్నికల సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా గ్రామాల్లో కోళ్ల పందాల విషయాన్ని ప్రస్టేజియస్‌గా తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే రాజమండ్రి, భీమవరం, విజయవాడ, ఏలూరు వంటి ప్రాంతాల్లోని లాడ్జీలు కూడా ఇప్పటికే బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మరో మూడు, నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావుడి మొదలు కాబోతోందన్నమాట.